నేనోరకం మూవీ రివ్యూ మరియు రేటింగ్

Nenorakam Movie Review

విడుదల తేదీ: మార్చ్ 17, 2017

దర్శకత్వం: సుద‌ర్శ‌న్ సలేంద్ర‌

నటీనటులు: శ‌ర‌త్‌కుమార్‌, సాయి రామ్ శంకర్, రేష్మీమీన‌న్‌, ఆదిత్య‌మీన‌న్‌, కాదంబ‌రి కిర‌ణ్ త‌దిత‌రులు

నిర్మాత: దేపా శ్రీకాంత్‌

సంగీతం:  మ‌హిత్ నారాయ‌ణ్‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గన్నాథ్ తమ్ముడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిరామ్ శంక‌ర్ మంచి హిట్ కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. చిన్న చిన్న పాత్ర‌లతో పాటు హీరోగా కూడా త‌న ల‌క్‌ను ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. ఈ ప్ర‌య‌త్నాల్లో భాగంగా సాయిరామ్ శంక‌ర్.. ‘రామ్ శంక‌ర్‌’గా పేరు మార్చుకుని చేసిన సినిమాయే నేనోర‌కం. త‌మిళ సీనియ‌ర్ హీరో శ‌ర‌త్‌కుమార్ ఇందులో కీల‌క‌పాత్ర పోషించ‌డంతో పాటు ట్రైల‌ర్ బాగా ఆక‌ట్టుకోవ‌డంతో ఈ సినిమాతోనైనా రామ్ శంక‌ర్ హిట్ కొట్టాడో లేదో ఇప్పుడు చూద్దాం.

కథ:

గౌత‌మ్‌(సాయిరాం శంక‌ర్‌) ఓ అనాథ‌, పండగ ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్ గా పని చేస్తుంటాడు స్వేచ్చ‌ (రేష్మీ మీన‌న్‌)ను చూడ‌గానే ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమె ప్రేమ కోసం అబ‌ద్దాల‌ాడుతాడు. ఎలాగైతేనేం ఆమె ప్రేమ‌ను గెలుచుకుంటాడు. స్వేచ్చ త‌న ప్రేమ‌ను చెప్ప‌డానికి గౌత‌మ్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న‌ప్పుడు ఎవ‌రో ఆమెను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప‌ర్(శ‌ర‌త్‌కుమార్‌) గౌత‌మ్‌కు ఫోన్ చేసి కొన్ని ప‌నులు చేయాల‌ని, లేకుంటే స్వేచ్చ‌ను చంపేస్తాన‌ని బెదిరిస్తాడు. స్వేచ్చ‌ను బ్ర‌తికించుకోవ‌డానికి గౌత‌మ్, కిడ్నాప‌ర్ చెప్పినదంతా చేస్తూ వ‌స్తాడు. చివ‌ర‌కు ఓ వ్య‌క్తిని చంప‌మ‌ని కిడ్నాప‌ర్ చెబుతాడు. ఇంత‌కు గౌత‌మ్ చంపాల‌నుకున్న వ్య‌క్తి ఎవ‌రు? అస‌లు కిడ్నాప‌ర్ స్వేచ్చ‌నే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? చివ‌ర‌కు గౌత‌మ్, స్వేచ్చ‌ త‌మ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారా.. అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

“మెట్రో” మూవీ రివ్యూ మరియు రేటింగ్

ఎలా ఉందంటే..?:

ఓవరాల్ గా సాయి గత చిత్రాలతో పోలిస్తే ‘నేనోరకం’ చాలా బాగుంది. సస్పెన్స్ తో కూడిన సెకండాఫ్ డ్రామా, శరత్ కుమార్, సాయి రామ్ శంకర్ ల నటన, హీరోయిన్ రేష్మి మీనను స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా చాలా వరుకు అనవసరమైన సన్నివేశాలతో నిండిన ఫస్టాఫ్ ఇందులో ప్రధాన బలహీనత. మొత్తం మీద కాస్త సాగదీసినట్టు ఉండే ఫస్టాఫ్ ను తట్టుకోగలిగితే మంచి స్టోరీ లైన్, సస్పెన్స్ డ్రామా కలిగిన ఈ చిత్రం తప్పక మెప్పిస్తుంది.

దర్శకుడు సినిమాలో సెకండాఫ్ మీద బాగా ఫోకస్ చేసినట్లు అనిపిస్తుంది, ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ తో మొదలయ్యే సెకండాఫ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శరత్ కుమార్ హీరో సాయి రామ్ శంకర్ ను కంటికి కనిపించకుండా బెదిరించడం, అతన్ని పరిగెత్తించి పరిగెత్తించి టెంక్షన్ పెట్టడం, తాను అనుకున్నవన్నీ చేయించడం వంటి సన్నివేశాలు బాగా మెప్పించాయి. సెకండాఫ్ మొత్తాన్ని శరత్ కుమార్, హీరో సాయి రామ్ శంకర్ లు తమ పెర్ఫార్మెన్స్ తో నడిపించారు. శరత్ కుమార్ ఫ్లాష్ బ్యాక్, అతను హీరో లైఫ్ లోకి ఎందుకు వచ్చాడనే సంగతి ఆకట్టుకున్నాయి. ఇక ఫస్టాఫ్లో హీరోయిన్ రేష్మి మీనన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా అందంగా ఉంది. పృథ్వి, లేట్ ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ కొన్ని చోట్ల మాత్రం పేలింది. సాయి రామ్ శంకర్, శరత్ కుమార్ ల నటన సినిమా కి హైలైట్.

సినిమా ఆరంభం నుండి ఇంటర్వెల్ ముందు వరకు హీరో హీరోయిన్ మధ్య నడిచే రొమాంటిక్ సీన్లు, కామెడీ సీన్లు మినహా మిగతా కథనం అంతా ప్రేక్షకుడికి కొంచెం విసుగు తెప్పిస్తాయి. ఎంఎస్ నారాయణ, వైవా హర్షల కామెడీ ఆరంభంలో బాగానే ఉన్న దాన్ని మోతాదుకు మించి సాగదీయడంతో ఒక దశలో చిరాకు కలిగింది. ఇక సెకండాఫ్ ఆరంభమయ్యే వరకు సినిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో ఫస్టాఫ్ నీరసంగా తయారైంది.

మా అబ్బాయి మూవీ రివ్యూ మరియు రేటింగ్

సాంకేతిక వర్గం పని తీరు…?:

కెమెరా వర్క్ రియలిస్టిక్ గా ఉండి ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు మహిత్ నారాయణ్ అందించిన మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయింది. ఎడిటింగ్ విషయం లో ఇంకాస్త జాగ్రత్త పడితే బాగుండేది.

బలాలు:

  • సెకండ్ హాఫ్
  • కామెడీ
  • సాయిరాం శంకర్, శరత్ కుమార్ ల నటన
  • సస్పెన్స్

బలహీనతలు:

  • ఫస్ట్ హాఫ్
  • ఎడిటింగ్
  • మ్యూజిక్

రేటింగ్: 2.75/5 

Add Comment

Click here to post a comment