“మెట్రో” మూవీ రివ్యూ మరియు రేటింగ్

Metro telugu movie review

విడుదల తేదీ: మార్చ్ 17, 2017

దర్శకత్వం: ఆనంద్ కృష్ణన్

నటీనటులు: శిరీష్ శరవణన్, బాబీ సింహ, సెండ్రాయణ్

నిర్మాత: ర‌జ‌నీ తాళ్లూరి

సంగీతం: జోహాన్

తమిళంలో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన ‘మెట్రో’ చిత్రం తెలుగులో ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి వారమే 16 కోట్లు కలెక్ట్‌ చేసి తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్ళూరి తెలుగులో నిర్మించారు. ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్‌ కొండేటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో మన రివ్యూ లో చూద్దాం..

కథ: 

ఈ సినిమా మనం చాలా రెగ్యులర్ గా పేపర్ లో చదివే చైన్ స్నాచింగ్ ని మెయిన్ పాయింట్ గా తీసుకుని, అసలు జనరల్ గా చైన్ స్నాచింగ్ లు ఎలా జరుగుతాయి, కుర్రాళ్ళు చైన్ స్నాచింగ్ లకి ఎందుకు పాల్పడుతుంటారు, ఆ బంగారాన్ని మార్కెట్ లో ఎలా అమ్ముతారు అనే పాయింట్స్ మీద రాసుకున్న కధే ఈ “మెట్రో”.

ఆది, సంతోషం మ్యాగజైన్ లో రైటర్ గా పనిచేస్తుంటాడు. అమ్మ, నాన్న, తమ్ముడు ఇదే ఆది ప్రపంచం. ఆది తమ్ముడు, మధు ఇంజనీరింగ్ చదువుతూ, గర్ల్ ఫ్రెండ్ ను ఖరీదైన బైక్ మీద షికారుకు తీసుకెళ్లాలని, ఐఫోన్ చేతిలో పట్టుకొని తిరగాలని కలలు కంటుంటాడు. మధు కోరికను ఆసరాగా తీసుకున్న ఫ్రెండ్స్ అతన్ని తప్పుదోవ పట్టిస్తారు. అప్పటి వరకు ఫ్యామిలీ తప్ప మరో ద్యాస లేని మధు, ఫ్రెండ్స్ తో కలిసి చైన్ స్నాచర్ గా మారతాడు. అలా తప్పుదారిలోకి అడుగుపెట్టిన మధు జీవితం చివరకు ఏమైంది. మధు కారణంగా ఆది జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్నదే మిగతా కథ.

మా అబ్బాయి మూవీ రివ్యూ

ఎలా ఉందంటే..?:

చైన్ స్నాచింగ్ నే కథా నేపథ్యం గా తీసుకుని సినిమాలు ఇంతవరకు రాలేదు, ఇలాంటి క్రైం కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఆనంద కృష్ణన్, అందుకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ బాగానే చేశాడు. ముఖ్యంగా యువత చైన్ స్నాచింగ్ కి ఎందుకు పాల్పడతారు ? దానికి దారితీసే పరిస్థితులు ఏమిటి ? వాళ్లు బంగారాన్ని ఎలా మారుస్తారు ? అన్న అంశాలను చాలా డిటెయిల్డ్ గా చూపించాడు. కథా నేపథ్యం మంచిదే అయినా దాన్ని వినోదభరితంగా తీర్చిదిద్దడంలో మాత్రం దర్శకుడు విఫలమయ్యాడు. దర్శకుడు తన ఫోకస్ అంత చైన్ స్నాచింగ్ లు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా అమ్ముతారు అనే అంశాలపై ద్రుష్టి పెట్టారే కానీ దాన్ని వినోదభరితంగా చూపించడంలో విఫలమయ్యారు. సినిమా మొత్తం చైన్ స్నాచింగ్ లకి అలవాటు పడిన కుర్రాడి పాత్ర ‘మధు’ చుట్టూ తిరుగుతుంది, కానీ ఆ పాత్రకి సత్య సరైన న్యాయం చేయలేకపోయాడు.

సినిమా ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు, మధు చైన్ స్నాచింగ్ కి పురిగొల్పబడే సన్నివేశాలతో నడిపించి, సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్, ఆది రివెంజ్ తీర్చుకోవడంతో ముగించాడు. ఆది పాత్రలో శిరీష్ మంచి నటన కనబరిచాడు. ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తూనే తన తల్లి చావుకు పగ తీర్చుకునే హీరోయిజం చూపించాడు. హీరోయిన్ గా నటించిన రమ్య పాత్ర కేవలం రెండు మూడు సీన్లకే పరిమితమయ్యింది. సినిమా మొత్తం మీద తెలుగు వారికి పరిచయం ఉన్న ఒకే ఒక్క నటి తులసి. ఆమె హీరో తల్లిగా తనకు అలవాటైన పాత్రలో ఆకట్టుకుంది. గ్యాంగ్ స్టర్ గుణ పాత్రలో బాబీ సింహా మెప్పించాడు.

ఎంటర్టైన్మెంట్ లేకపోయినా, సీరియస్ క్రైమ్ మూవీస్ ని ఇష్టపడే ప్రేక్షకులు చూడదగ్గ సినిమా.

సాంకేతిక వర్గం పని తీరు…?:

సినిమాటోగ్రాఫర్ ఉదయ్ కుమార్. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయి. జోహన్ తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా స్థాయిని పెంచాడు. తెలుగు డబ్బింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. డైలాగ్ లు పరవాలేదనిపించాయి.

బలాలు:

  • కథ
  • బాబీ సింహా క్యారెక్టర్

బలహీనతలు:

  • స్లో నారేషన్
  • మధు పాత్ర చేసిన సత్య
  • కామెడీ లేకపోవడం
  • హీరో క్యారెక్టర్ ఎక్కడా ఎలివేట్ కాకపోవడం
  • తెలుగు వారికి తెలిసిన నటీనటులు లేకపోవడం

రేటింగ్: 2.5/5

మహాభారతంపై కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

Add Comment

Click here to post a comment