మా అబ్బాయి మూవీ రివ్యూ మరియు రేటింగ్

Maa Abbayi Movie Review

విడుదల తేదీ: మార్చ్ 17, 2017

దర్శకత్వం: కుమార్ వ‌ట్టి

నటీనటులు: శ్రీ విష్ణు, చిత్ర శుక్ల‌, కాశీవిశ్వ‌నాథ్‌, స‌నా, జెమిని సురేష్ తదితరులు

నిర్మాత: బ‌ల‌గ ప్ర‌కాష్ రావు

సంగీతం: సురేష్ బొబ్బిలి

తొలి చిత్రం ప్రేమ ఇష్క్ కాద‌ల్‌తో ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైన శ్రీవిష్ణు, కెరీర్ స్టార్టింగ్ నుండి మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లో న‌టిస్తూ వ‌చ్చాడు. రీసెంట్‌గా నారా రోహిత్‌, శ్రీవిష్ణు క‌లిసి న‌టించిన‌ అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు సినిమాతో శ్రీ విష్ణు మంచి విజ‌యాన్నే అందుకున్నాడు. అయితే సోలో హీరోగా శ్రీవిష్ణు కొత్త చిత్రం మా అబ్బాయి ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రి సోలో హీరోగా శ్రీ విష్ణు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో మన రివ్యూ లో చూద్దాం..

కథ :

హైద‌రాబాద్‌లో నివ‌సించే ఆనంద‌రావు(కాశీ విశ్వనాథ్‌)ది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. ఉన్నంత‌లో త‌న అబ్బాయి(శ్రీ విష్ణు), అమ్మాయితో క‌లిసి హ్యాపీగా ఉంటుంటాడు. వీరి లైఫ్ ఆనందంగా సాగిపోతున్న స‌మ‌యంలో ఆనంద‌రావు కూతురుకి పెళ్ళి నిశ్చ‌య‌మ‌వుతుంది. మరోవైపు ఆనంద‌రావు అబ్బాయి(శ్రీ విష్ణు)కూడా ఎదురింటి అమ్మాయిని ప్రేమిస్తాడు ఆ అమ్మాయి కూడా అబ్బాయిని ప్రేమిస్తుంది. అంత సంతోషంగా ఉన్న టైం లో కూతురు పెళ్ళి కోస‌మ‌ని కుటుంబ‌మంతా క‌లిసి షాపింగ్‌కు వెళ‌తారు. అప్పుడు జ‌రిగిన బాంబు పేలుళ్ళ‌లో అబ్బాయి మిన‌హా అతని తండ్రి, అమ్మ, అక్క చనిపోతారు. దాంతో అబ్బాయి(శ్రీ విష్ణు), బాంబు దాడికి కార‌ణ‌మైన వారిపై ప‌గ పెంచుకుని, వాళ్ళని చంపాలని నిర్ణయించుకుంటాడు. చివరికి ఆ అబ్బాయి బాంబు దాడికి కార‌ణ‌మైన వారిపై ప్ర‌తీకారం తీర్చుకున్నాడా…? మరోవైపు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడా? అన్నది మిగిలిన కధ.

ఎలా ఉందంటే..?:

ముందుగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది విష్ణు గురించి ఎందుకంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో డ్యాన్సులు, ఫైట్స్‌లో శ్రీ విష్ణు కాస్తా బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు. ఈ సినిమాలో ఇంకో స్పెషల్ ఎంటంటే విష్ణు కి ఈ సినిమాలో పేరు పెట్టకపోవడం…కాని సినిమా మొత్తం కూడా విష్ణు ని అబ్బాయి అని పిలుస్తు సినిమా టైటిల్ ని పదే పదే గుర్తుచేస్తుంటాడు దర్శకుడు. ఇక హీరోయిన్ చిత్ర శుక్ల లుక్ ప‌రంగా చూడ‌టానికి బావుంది. అయితే న‌ట‌న ప‌రంగా పెద్ద‌గా స్కోప్ లేని పాత్ర‌, ఉన్నంత‌లో త‌న పాత్ర‌కు న్యాయం చేసింది.

కాశీవిశ్వ‌నాథ్‌, స‌నా, జెమిని సురేష్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేష్ బొబ్బిలి ట్యూన్స్ బాగున్నాయి. కానీ..సినిమాను హ్యండిల్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు కుమార్ వ‌ట్టి ఆకట్టుకోలేక‌పోయాడు. ఎందుకంటే కథలో ఏమాత్రం కొత్తదనం లేకపోవడం…మరో వైపు సినిమా మొదటి భాగం లో వచ్చే అనవసరపు సెంటిమెంట్ సీన్స్  ప్రేక్షకులకు విసుగు పుట్టిస్తాయి.

ఇక ఫస్ట్ నుండి పవర్ ఫుల్ గా ఉన్న విలన్ క్యారెక్టర్ని చివరలో చాల సింపుల్ గ తేల్చేయడం కుడా సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు. సినిమా కుడా నాన్‌సింక్‌గా ర‌న్ అవుతుంటుంది ఆ విషయం సినిమా చూసేవారికి స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ సీన్స్ క‌న్విసింగ్‌ గా అనిపించ‌వు. టైటిల్ విని ఇదేదో మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అనుకుని వ‌స్తారు. ముందు కాస్తా ఆఫీలింగ్ ఉన్నా, త‌ర్వాత సినిమా క‌క్ష్య‌, ప్ర‌తీకారాల‌తోనే సాగుతుంది. మొత్తం మీద విష్ణు హీరోగా తోలి ప్రయత్నం బెడిసి కొట్టిందని చెప్పుకోవచ్చు…చివరగా విష్ణు సోలో హీరో సినిమాల కన్నా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది.

సాంకేతిక వర్గం పని తీరు…?: థ‌మ శ్యామ్ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. వెన్నెల క్రియేష‌న్స్‌ నిర్మాణ సంస్థ వారి ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.

బలాలు:

  • శ్రీవిష్ణు
  • మ్యూజిక్

బలహీనతలు:

  • స్క్రీన్‌ప్లే
  • రొటీన్ స్టోరీ
  • అనవసరపు సన్నివేశాలు

రేటింగ్: 2/5