చిత్రాంగద మూవీ రివ్యూ మరియు రేటింగ్

Chitrangada Movie Review

విడుదల తేదీ: మార్చ్ 10, 2017

దర్శకత్వం: అశోక్‌.జి

నటీనటులు: అంజలి, సాక్షి గులాటి, జయప్రకాశ్ వి

నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్

సంగీతం: సెల్వగణేష్

‘గీతాంజలి’ వంటి లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం తర్వాత కథానాయిక అంజలి టైటిల్‌ పాత్రలో నటిస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం ‘చిత్రాంగద’. శ్రీ విఘ్నేష్‌ కార్తీక్‌ సినిమా పతాకంపై పిల్ల జమీందార్‌ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు అశోక్‌.జి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్‌ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ భాషలో ‘యార్నీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. చాల కాలం తర్వాత అంజలి ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి ఆ అంచనాలను చిత్రాంగద ఏమాత్రం అందుకుందో ఇప్పుడు చూద్దాం…

కధలోకి వెళ్తే: 

చిత్ర(అంజ‌లి) త‌ను చ‌దివిన కాలేజ్‌లోనే అసిస్టెంట్ సైకాల‌జీ ప్రొఫెస‌ర్‌గా జాయిన్ అవుతుంది. అంజ‌లి కాలేజ్ హాస్ట‌ల్‌లోనే ఉంటుంది. అయితే అంజ‌లి ఉండే హాస్ట‌ల్లో దెయ్యం తిరుగుతుంద‌ని చాలా మంది అమ్మాయిలు హాస్ట‌లు విడిచి వెళ్ళిపోతారు. అయితే ఆ దెయ్యం ఎవ‌రో కాదు, అంజ‌లినే అని తెలుస్తుంది. చిత్ర ఒక అమ్మాయి అయినా, తోటి అమ్మాయిల‌పై కోరిక‌తో ఉండే ఆమె ప్ర‌వ‌ర్త‌న చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతారు.

అంజ‌లి అల ఎందుకు చేస్తుందో సైక్రియాటిస్ట్ నీల‌కంఠ‌(జ‌య‌ప్ర‌కాష్‌) తెలుసుకోవడానికి ప్ర‌య‌త్నిస్తాడు. అప్పుడు నీల‌కంఠ‌కు ఓ విష‌యం తెలుస్తుంది. ఎవ‌రో ఒకామే, ఒక వ్య‌క్తిని చెరువులో చంపేసింద‌ని, ఆ హ‌త్య త‌న క‌ల‌లోకి వ‌స్తుంద‌ని చిత్ర చెబుతుంది. అయితే చిత్ర చెప్పేదంతా చూసి తనను పిచ్చిది అని అంద‌రూ అనుకుంటారు…. అస‌లు చిత్ర‌కు వ‌చ్చే క‌ల నిజ‌మా..కాదా? అస‌లు చెరువులో చనిపోయిన వ్యక్తి ఎవ‌రు? ఆ వ్యక్తికి చిత్ర‌కు ఉన్న రిలేష‌న్ ఏంటి? అతడిని ఎవరు హత్య చేశారు? అసలు చిత్ర చివరికి ఎం చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే మీరు తెరపై చూడాల్సిందే..

ఎలా ఉందంటే..?:

ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది అంజలి నటన గురించి ఎందుకంటే ఈ కథ అంతా అంజలి పాత్ర చుట్టే సాగుతుంది. పాత్రకు తగ్గట్టుగా అంజలి చక్కటి అభినయాన్ని ప్రదర్శించింది…లేడీగా ఉంటూనే దెయ్యం ప‌ట్టిన‌ప్పుడు మ‌గ‌డిలా న‌టించే విధానం అందరిని ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ అంత సస్పెన్స్ గా సాగిపోతుంది… కాకపోతే ఫస్ట్ హాఫ్ లో సరైన కామెడీ లేకపోవడం కాస్త బోర్ గా అనిపిస్తుంది.

చిత్ర అమెరికా వెళ్లిన తర్వాత వచ్చే కొన్ని సీన్స్ లో అంజ‌లి న‌ట‌న బాగుంది. సింధుతులాని, దీప‌క్‌, ర‌క్ష‌, సాక్షిగులాటి, రాజా రవీంద్ర‌, జ‌య‌ప్ర‌కాష్ స‌హా న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌ వరకే పరిమితమయ్యారు…. అలాగే సినిమాలో కామెడి కోసం క్రియేట్ చేసిన స‌ప్త‌గిరి, జబర్దస్త్ సుధీర్ కామెడి ఓ మోస్తారుగా ప‌రావాలేద‌నిపిస్తుంది… కాకపోతే స‌ప్త‌గిరి కామెడి కాస్త రొటీన్ గా అనిపిస్తుంది. నెగ‌టివ్ షేడ్ ఉన్న రవి వర్మ పాత్ర‌లో దీప‌క్ కొద్దీ సేపు ఉన్న అతని న‌ట‌న బాగానే ఉంది. సినిమా ఫ‌స్టాఫ్ చూసినంత సేపు ఇంట‌ర్వెల్ ఎప్పుడు వ‌స్తుందా అనేలా అనిపిస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ కుడా స్లోగా స్టార్ట్ అవుతుంది…సినిమా మొత్తం లో చివరి అరగంట పర్వాలేదనిపిస్తుంది. ద‌ర్శ‌క‌డు అశోక్ పూర్వ‌జ‌న్మ‌లు అనే కాన్సెప్ట్‌ బాగానే ఉన్న ఎగ్జిక్యూష‌న్‌లో ఎక్క‌డో తేడా కొట్టేసిన‌ట్టు క‌న‌ప‌డుతుంది… సెల్వ‌గ‌ణేష్‌ సంగీతం పెద్దగా మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ద‌ర్శ‌క‌డు అశోక్ ఎదో చూప్పిద్దామనుకుని ఎదో చుపించాడనే విషయం చూసిన ప్రతిఒక్కడికి స్పష్టంగా తెలుస్తుంది. సినిమా నిడివి ఇంకాస్తా త‌గ్గించి ఉంటే బావుండేది.

సాంకేతిక వర్గం పని తీరు…?:

బాలిరెడ్డి కెమెరా పనితనం కొన్ని సన్నివేశాల్లో బావుంది. సంగీతం ఈ సినిమాకి మైనస్‌గా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి ఎడిటింగ్ కుడా పెద్ద మైనస్. శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్ సంస్థ వారి నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

బలాలు:

  • అంజలి నటన
  • సెకండ్ హాఫ్

బలహీనతలు: 

  • సాగదీత సన్నివేశాలు
  •  సంగీతం
  • అవసరం లేని కామెడీ
  • మ్యూజిక్
  • ఎడిటింగ్

రేటింగ్: 2/5

Add Comment

Click here to post a comment