ఆకతాయి మూవీ రివ్యూ మరియు రేటింగ్

Aakatayi Movie Review

విడుదల తేదీ: మార్చ్ 10, 2017

దర్శకత్వం: రాం భీమన

నటీనటులు: ఆశిష్‌ రాజ్‌, రుక్సర్‌ మీర్‌, ప్రదీప్ రావత్

నిర్మాతలు: కె.ఆర్‌. విజయ్‌ కరణ్‌, కె.ఆర్‌.కౌషల్‌ కరణ్‌, కె.ఆర్‌. అనిల్‌ కరణ్‌

సంగీతం: మణిశర్మ

ఆశిష్‌ రాజ్‌, రుక్సార్‌ మీర్‌ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకతాయి’. వి.కె.ఎ.ఫిలింస్‌ బ్యానర్‌పై రామ్‌భీమన దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజరు కరణ్‌, కౌశల్‌ కరణ్‌, అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకులముందుకు వచ్చింది. మరి ఈ ‘ఆకతాయి’ ఏమాత్రం అంచనాలను అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం…

కధలోకి వెళ్తే:

విక్రాంత్(ఆశిష్‌ రాజ్‌ ) ఒక కాలేజీ  కుర్రాడు . తన తండ్రి శేఖర్  (సుమన్)  దగ్గర కిక్  బాక్సింగ్  కూడా శిక్షణ పొందుతూ  ఉంటాడు . కాలేజీలో  అనగా (రుక్సార్‌ మీర్‌) ప్రేమలో పడతాడు విక్రాంత్  .అనుకోకుండా ముంబయి  నుంచి  వచ్చిన మాఫియా  ముఠా  విక్రాంత్  ని చంపడానికి ప్రయత్నించే క్రమంలో విక్రాంత్   తల్లి తండ్రులను (సుమన్, రాశి ) హతమారుస్తారు . ఇదే  క్రమంలో  సుమన్, రాశి లు తన అసలు తల్లితండ్రులు కాదని తెలుసుకుంటాడు విక్రాంత్ .అసలు కధ  ఇక్కడినుంచి మొదలవుతుంది.అసలు తాను ఎవరు  ఎందుకు   తనను చంపాలనుకుంటున్నారు  సుమన్, రాశి లు  ఎవరు తన అసలు తల్లితండ్రులు  ఎక్కడున్నారు అని   తెలుసుకోవటమే మిగితా  కధ.

ఎలా ఉందంటే..?:

మాఫియా, టెర్రరిజం నేపథ్యంలో సాగే కథలో  కొంత కొత్తదనం కనిపించినా, కధనం లో మాత్రం దర్శకుడు తన పనితనాన్ని చూపించలేకపోయారు. సింధురపువ్వు హీరో రాంకీ, నాగబాబు, బ్రహ్మ నందం, సుమన్, రాశి, పోసాని కృష్ణమురళి, ప్రదీప్ రావత్, 30 years ప్రుథ్వి లాంటి  భారీ  తారాగణం ఎంచుకోవడంలో  సఫలమైన దర్శకుడు  హీరో విషయంలో మాత్రం విఫలం  అయ్యాడు. కద ఆసక్తిగా సాగుతున్నా, బలమైన హీరో లేకపోవటంతో ప్రేక్షకుడు కొంత నిరుస్సాహానికి  గురవుతాడు. లాజిక్ లు పూర్తిగా గాలికొదిలేసిన కొన్ని చోట్ల మాత్రం దర్శకుడి ప్రతిభ కనపడుతుంది. ఒక మోస్తరు ఇమేజ్ వున్న హీరోతో చేసివుంటే ఫలితం వేరుగా ఉండేదేమో అనిపిస్తుంది. హీరోయిన్  అందంతో కొంత  పరవాలేదనిపించినా అభినయంలో మాత్రం తేలిపోయింది. జగదాంబ  జానీ పాత్రలో ఒకే ఒక్క సీన్  అయినా మెప్పించాడు ప్రుథ్వి . మిగిలిన తారాగణం  వారి పాత్రలకు తగ్గట్టుగా బాగానే  చేశారు. అమీషాపటేల్ తో చేయించిన  ఐటమ్ సాంగ్ కూడా ఏమంత గొప్పగా లేదు .

సాంకేతిక వర్గం పని తీరు…?:

నిర్మాణవిలువలు  చాలా  బాగున్నాయి. ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు. ఒక సాదా సీదా హీరో పరిచయానికి  ఇంత ఖర్చుచేయడం సాహసం అనే చెప్పాలి. పాటలు పరవాలేదు అనిపించాయి. నేపధ్యసంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఎడిటింగ్ లోపం స్పష్టంగా  కనిపిస్తుంది.

బలాలు:

  • నిర్మాణవిలువలు
  • నేపద్యసంగీతం
  • భారీ తారాగణం
  • ఇంటర్వెల్ సీన్స్
  • క్లైమాక్స్

బలహీనతలు:

  • హీరో, హీరోయిన్
  • కామెడీ
  • లాజిక్ లేని కధనం

రేటింగ్: 2/5

Add Comment

Click here to post a comment