ముకుంద, కంచె చిత్రాలు ఆర్థికంగా భారీ విజయాలు అందుకోకపోయినా కానీ వరుణ్‌ తేజ్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కంచె చిత్రంలో అనుభవమున్న నటుడిలా తన పాత్రకి న్యాయం చేసి మార్కులు కొట్టేసాడు. అయితే ఆ తర్వాత కమర్షియల్‌ మైలేజ్‌ కోసమని లోఫర్‌, మిస్టర్‌ చిత్రాలు చేసాడు. ఫామ్‌లో లేరు అని తెలిసినా కానీ పూరి జగన్నాథ్‌, శ్రీను వైట్లతో పని చేసాడు. కమర్షియల్‌గా హిట్‌ ఇవ్వడం అటుంచి, పీడకలలు వచ్చే ఫలితాలని వారిద్దరూ అందించారు. ముఖ్యంగా మిస్టర్‌ అయితే తను సంపాదించిన గుడ్‌విల్‌ మొత్తం పోగొట్టే లెవల్‌కి ఫ్లాప్‌ అయింది.

READ MORE:  అలాంటి కథే కావాలంటున్న రాజమౌళి…!

కమర్షియల్‌ చిత్రాలు కానీ మిస్‌ఫైర్‌ అయితే ఏమవుతుందనేది స్వయంగా తెలుసుకున్న వరుణ్‌ తేజ్‌ మునుపటిలా ఎక్స్‌పెరిమెంట్స్‌ బెటర్‌ అనుకుంటున్నాడు. అందుకే ఘాజీ దర్శకుడు సంకల్ప్‌తో ఒక సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇకపోతే దీనికంటే ముందుగా శేఖర్‌ కమ్ములతో చేస్తోన్న ఫిదా విడుదలవుతుంది. ఆ సినిమాతో అయినా వరుణ్‌ హిట్ల ఖాతా ఓపెన్‌ అవుతుందో లేదో పాపం.

(Visited 393 times, 1 visits today)

Related Post