తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన నటుడు, నిర్మాత విశాల్‌ ఆరంభంలోనే కఠినమైన నిర్ణయాలతో సంచలనం రేపుతున్నారు. శాటిలైట్‌ రైట్స్‌ వ్యవహారంలో చిన్న, పెద్ద చిత్రాలకు తారతమ్యం చూపుతున్న టీవీ చానళ్లకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీవీ రంగంలో వివాదాస్పదంగా మారింది. టీవీ చానళ్లకు తమ సినిమాల పాటలు, ట్రైలర్లు, క్లిప్పింగ్‌లను ఉచితంగా ఇవ్వొద్దని నిర్మాతల సంఘం సభ్యులందరికీ విశాల్‌ సూచించారు. నిర్మాతలకు ఆదాయం సమకూర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, కంటెంట్‌కు డబ్బులు చెల్లించాలని టీవీ చానళ్లను కోరామని నిర్మాతల సంఘం కార్యవర్గ సభ్యులు తెలిపారు.

READ MORE: తెలుగు ఇండస్ట్రీ వేస్ట్‌…తమిళ ఇండస్ట్రీ బెస్ట్ అంటున్నఅజయ్ ఘోష్…!

తమిళనాట ప్రతి సినిమా టిక్కెట్‌‌పై ఒక రూపాయి రైతులకు కేటాయించాలని విశాల్ తీసుకున్న నిర్ణయం తెలిసింది. దీనిని గతంలో నిర్మాతలు వ్యతిరేకించారు. ఇప్పటికే నష్టాల్లో ఉంటే మళ్లీ రైతులకు ప్రతి టికెట్‌లో ఒక రూపాయి ఇవ్వలేమని విశాల్‌కు సినీ నిర్మాతలు తెలిపారు. వారి బాధను అర్థం చేసుకొనే విశాల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీవీ చానళ్లకు టీఆర్‌పీ రేటింగ్స్‌ ఆధారంగా ధరలు నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అధ్యక్షుడిగా ఎన్నికైన విశాల్ కొత్త విధానాలతో ఏ మాత్రం పాపులర్ అవుతాడో చూడాలి మరి.

READ MORE: దర్శకుడు మణిరత్నంపై ఆరోపణలు…!

(Visited 1,574 times, 1 visits today)

Related Post