‘పెళ్లిచూపులు’ అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ చిత్ర హీరో పేరు విజయ్ దేవరకొండ అని చాలామందికే తెలుసు. ‘ఎవడే సుబ్రమణ్యం’లో దూద్ కాశీ కుర్రాడిగానే అతను జనాలకు గుర్తున్నాడు. కానీ ‘పెళ్లిచూపులు’ విడుదలయ్యాక అతడి రేంజే మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో నాని తర్వాత ఏ హీరోకూ లేనన్ని ఆఫర్స్ విజయ్‌కు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. రెండో.. మూడో కాదు.. ఏకంగా అతడి చేతిలో ఏడు కొత్త ప్రాజెక్టులుండటం విశేషం.

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ‘ద్వారక’ను మినహాయిస్తే.. ‘అర్జున్ రెడ్డి’ పేరుతో విజయ్ హీరోగా మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి హైప్ ని క్రియేట్ చేసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం వేసవికి విడుదలవుతుంది. దీని తర్వాత గీతా ఆర్ట్స్-యువి క్రియేషన్స్ కలిసి నిర్మించబోయే సినిమాలో విజయ్ నే హీరో. మరోవైపు పరశురామ్ దర్శకత్వంలో విజయ్ హీరో గా గీతా ఆర్ట్సే మరో సినిమాను నిర్మించనుంది. ఇక ‘ప్రస్థానం’ ఫేమ్ దేవా కట్టా కూడా విజయ్‌తో ఓ సినిమాకు కథ రెడీ చేస్తున్నాడు…కానీ దాని కంటే ముందు అతను ‘ప్రస్థానం’ హిందీ వెర్షన్ తీయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తయ్యాకే విజయ్ సినిమాను మొదలుపెడతాడు దేవా కట్టా.

‘అలా మొదలయింది’, ‘కళ్యాణ వైభోగమే’ లాంటి హిట్ సినిమాల డైరెక్టర్ నందిని రెడ్డి కూడా విజయ్‌తో ఓ సినిమా చేయబోతోంది. సునీల్‌తో ప్రస్తుతం ‘ఉంగరాల రాంబాబు’ తీస్తున్న క్రాంతి మాధవ్ కూడా విజయ్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వీళ్లందరూ కాక భరత్ కమ్మ అనే కొత్త డైరెక్టర్ తోనూ ఓ సినిమా చేయనున్నాడు విజయ్. ఇవన్నీ పూర్తి చేయడానికి కనీసం విజయ్ కి రెండేళ్ల టైం పడుతుంది.

(Visited 31 times, 1 visits today)

Related Post