విజయ్‌ ఆంటోని సంగీత దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగు పెట్టి… తెలుగు లో మహాత్మ, దరువు లాంటి చిత్రాలకి మ్యూజిక్‌ డైరెక్టర్ గా పనిచేసి అనుకోకుండా హీరో గా మారి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నాడు. డాక్టర్ సలీమ్, బిచ్చగాడు లాంటి విజయాలతో టాలీవుడ్‌ ట్రేడ్‌లోను హాట్‌గా మారాడు. అయితే నటుడిగా తనకి చాలా లిమిటేషన్స్‌ వున్నాయని విజయ్‌ ఆంటోని ఒప్పుకుంటాడు.

తాను గొప్ప నటుడ్ని కాదని, అందుకే ఆ మైనస్‌లు కవర్‌ చేసుకోవడానికి విభిన్నమైన కథలు ఎంచుకుంటానని, విభిన్నమైన కథలు వున్న సినిమా చేస్తే నటుడిలో వున్న మైనస్‌లు కూడా కొట్టుకుపోతాయని, అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినప్పటికీ ఒక సినిమా తర్వాత ఒక సినిమా అంటూ నెమ్మదిగా వెళుతున్నానని చెప్పాడు. అయితే సంగీత దర్శకుడిగా కంటే నటుడిగానే బాగుందని, పేరు, ఆదాయంతో పాటు నటుడి జాబ్‌పై ఎలాంటి ఒత్తిడి కూడా వుండదని, బాగ సంపాదించేద్దామనే ఆశలు లేవు కానీ ఇప్పుడున్న స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ విజయాలు అందుకోగలిగితే అదే చాలని అంటున్నాడు. విజయ్‌ నటించిన యమన్‌ ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. ఈ పొలిటికల్‌ థ్రిల్లర్‌ అన్ని రాష్ట్రాల రాజకీయాలని ప్రతిబింబిస్తుందని, అంచేత నేటివిటీ సమస్యలుండవని విజయ్‌ ఆంటోని నమ్మకంగా చెపుతున్నాడు.

(Visited 59 times, 1 visits today)

Related Post