‘హ్యాపీడేస్’ సినిమాతో యువతను ఆకట్టుకున్న హీరో రాహుల్ రీఎంట్రీగా వస్తున్న ‘వెంకటాపురం’ సినిమా టీజర్ గురువారం విడుదలయ్యింది. హిందీ టెలివిజన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా పాపులర్ అయిన మహిమ మక్వానా రాహుల్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. నిజమైన సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నామనీ, ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిస్తున్నామనీ సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే చెప్పింది. టీజర్ చూస్తే.. వారు చెప్పింది చేసి చూపించారని అనిపిస్తోంది. ఒక అమ్మాయి హత్య చుట్టూ తిరిగే కథ ఆధారంగా సినిమా నడుస్తుంది. హీరోనే ఆ అమ్మాయిని మర్డర్ చేశాడన్న కోణంలో పోలీసులు హీరోను అనుమానించటం, విచారించటం.. ఇవే టీజర్ లో కనిపిస్తున్నాయి. చివరికి అసలు మర్డర్ ఎవరు చేశారనేదే ఆసక్తికరమని దర్శకుడు టీజర్ ద్వారా చెప్పాడు. టీజర్ చివర్లో కనిపించిన ట్విస్టు.. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. మొత్తానికి వెంకటాపురం టీజర్.. ఆకట్టుకునేలా ఉంది.

Comments

comments