Read this review in English here

Venkatapuram Movie Review

Venkatapuram movie Rating

Venkatapuram movie Review and Rating

 

విడుదల తేదీ: మే 12, 2017

దర్శకత్వం: వేణు మడికంఠి 

నటీనటులు: రాహుల్, మహిమ మక్వానా 

నిర్మాతలు: గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్యా ఆర్ట్స్ 

సంగీతం: అచ్చు

హ్యాపీ డేస్ లో టైసన్ అనే పాత్రలో నటించి మెప్పించిన రాహుల్ తర్వాత వచ్చిన రెయిన్ బో, ఐ లవ్ యు బంగారం చిత్రాలు తనకి విజయాన్ని ఇవ్వకపోయినా చాల కాలం విరామం తీసుకుని నటించిన చిత్రమే వెంకటాపురం. ఈ చిత్రం తో వేణు మడికంఠి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుటికే ఈ చిత్రం ట్రైలర్ మరియు పాటలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు మన రివ్యూలో చూద్దాం.

కథ:

ఆనంద్ (రాహుల్) ఒక పిజ్జా సెంటర్ లో పనిచేస్తుంటాడు. తనకు తన కింద ఫ్లాట్ లో ఉండే చైత్ర (మహిమ మక్వానా) అనే అమ్మాయితో పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారుతుంది. చైత్ర ఒక స్టూడెంట్… చైత్ర తన ఫ్రెండ్స్ వల్ల అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. ఆ సమస్యను ఆనంద్ తో చెబుతుంది…దాంతో ఆనంద్ ఆ సమస్యను ఎలాగైనా పరిష్కరిద్దాం అనుకుంటాడు. కానీ అనుకోకుండా చైత్రకి పోలీసులు వల్ల అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం ఏమిటి? అసలు చైత్ర తన ఫ్రెండ్స్ చేసిన తప్పు ఏమిటి ? చివరికి ఆనంద్ ఎం చేస్తాడు అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..?:

మనం మొదటగా ఈ చిత్ర దర్శకుడు గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే మొదటి సినిమా అయినా మంచి కథతో వచ్చాడు అని చెప్పుకోవచ్చు. సినిమా మొత్తం చాల సస్పెన్స్ గా ఉంటుంది. ఇందులో రాహుల్, మహిమ మక్వానా నటన చాల బాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కానీ చిత్రం మొదటినుండే సస్పెన్స్ గా ఉండటంతో చిత్రంలో కామెడీ అనేది ఏ మాత్రం ఉండదు. ఇక అచ్చు సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి.

ఇక చివరిలో పోలీస్ పాత్రలో కనిపించే అజయ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మిగిలిన నటీనటులు వాళ్ళ పాత్రలకు మాత్రమే పరిమితమయ్యారు. ఫస్ట్ హాఫ్ ఈ చిత్రానికి మైనస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో సంబంధం లేని సన్నివేశాలు ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తాయి. అంతే కాదు చాల నెమ్మదిగా సాగే కధనం కూడా ఒకింత విసుగు పుట్టిస్తాయి. ఒకానొక సమయంలో ట్రైలర్ కి సినిమాకి సంబంధం లేదే అనే భావన మనకి కలుగుతుంది

కానీ సెకండ్ హాఫ్ లో రాహుల్ నటన మరియు కథలో కొత్త కోణం ప్రేక్షకుడిని కొంతవరకు తృప్తిపరుస్తాయి. చివరి క్లైమాక్స్ కూడా అందరికి తృప్తినిస్తుంది. కాకపోతే ఈ చిత్రం లో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు. కానీ కొన్నియదార్ధ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రం కావడం అది ఇప్పటి యూత్ లైఫ్ స్టైల్ కి దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. దర్శకుడు కధనం పై మరి కొంత దృష్టి పెడితే బాగుండేది. గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్యా ఆర్ట్స్ నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

  …………………….మొత్తం మీద యూత్ చూడ దగ్గ సినిమా………………………..

బలాలు:

  • రాహుల్
  • మహిమ మక్వానా
  • కధ

బలహీనతలు:

  • ఫస్ట్ హాఫ్
  • సంబంధం లేని కొన్ని సన్నివేశాలు

రేటింగ్: 2.75 /5

*****ఈ రివ్యూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో చూసి వ్రాయబడినది*****

 

(Visited 4,131 times, 1 visits today)

Related Post