మెగాస్టార్ చిరంజీవి తన 150వచిత్రం ఖైదీ నంబర్ 150 విజయం ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే ఊపులో తర్వాత చిత్రాన్ని కూడా ఫైనలైజ్ చేసే పనుల్లో ఉన్నారు. చిరంజీవి చిరకాల కోరిక అయిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కే మక్కువ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. సురేందర్ రెడ్డి కూడా ఈ చారిత్రక చిత్రం కోసం బాగానే ప్రిపేర్ అయిపోతున్నాడు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైనే నిర్మాణం కానున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం.. రామ్ చరణ్ అప్పుడే పనులు ప్రారంభించేశాడట. ఈ చిత్రానికి అవసరమైన విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాహుబలి కోసం వర్క్ చేసిన కమల్ కణ్ణన్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చెర్రీ బిగ్గెస్ట్ హిట్ అయిన మగధీర కోసం కూడా ఈయనే విజువల్ ఎఫెక్ట్స్ అందించాడు. అయితే.. పీరియాడికల్ మూవీ కావడంతో.. ఉయ్యాలవాడకు గ్రాఫిక్స్ కంటే ఎక్కువగా సెట్స్ తో అవసరం ఉంటుంది. కొన్ని అంశాలకు మాత్రం గ్రాఫిక్స్ వాడకం తప్పనిసరి.

స్వాతంత్ర్య సమరయోధుడి చరిత్రను చిరంజీవితో చేస్తే.. ఆ పాత్రకు మరింత వన్నె చేకూరడం ఖాయం అని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అది కూడా చిరు ఈ ప్రాజెక్టు చేస్తుండడంతో భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు అవకాశం ఉంది. భారీ బడ్జెట్ తో భారీగా నిర్మాణం జరిపితే.. ఖైదీ నంబర్ 150 మాదిరిగానే ఉయ్యాలవాడతో కూడా 100 కోట్ల బిజినెస్ చేయడం అంత కష్టమేం కాదని భావిస్తున్నాడట ప్రొడ్యూసర్ రాంచరణ్ .

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ విషయానికి వస్తే 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరి లో ఆయన మరణంతో ముగిసింది. మరి ఇటువంటి కథని స్టైలిష్ డైరెక్టర్ ఎలా తెరకెక్కిస్తాడో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

(Visited 265 times, 1 visits today)

Related Post