సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష ఆ మధ్య కాస్త డల్ అయిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొన్ని నెలల క్రితం త్రిష కెరీర్ ముగిసిపోయిందని ఇక రిటైర్మెంట్ అని అనుకున్నారు అందరూ. కానీ, ఇప్పుడు త్రిష గోడకు కొట్టిన బంతిలా తిరిగి తన స్టార్ డమ్ ను నిలబెట్టుకుంది. మొన్నటివరకు చేతిలో ఒకటి రెండూ హారర్ సినిమాలు మాత్రమే పెట్టుకున్న త్రిష.. ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సెట్ చేస్తూ టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఇంతలా ఎవరూ ఊహించని విధంగా త్రిష సత్తా చాటడానికి కారణం.. బ్యాంకాక్ లో చేసిన పూజలే నని ఇప్పుడు వార్తలు వినిపిస్తుండటం విశేషం.

అదేంటి.. బ్యాంకాక్ వెళ్ళేది మసాజ్ చేయించుకోవడానికి, తమ బ్యూటీని మెరుగులు దిద్దుకునే పనిలో భాగంగా ఆయుర్వేదిక్ మసాజ్ లు, శాండ్ మసాజ్ లు వంటి వాటి కోసం కదా వెళ్ళేది అనుకుంటున్నారా.. త్రిష విషయంలో కూడా అదే జరిగిందట. అయితే, ఈలోపు బ్యాంకాక్ లోని ఓ పార్లర్ లో పనిచేసే ఓ యువతి మన త్రిషకు అక్కడ ఊరి చివరిలో ఉన్న ఓ ఆలయం గురించి చెప్పుకొచ్చిందట.

ప్రధానంగా అక్కడ కొన్ని పూజలు చేస్తే చాలా వింతలు జరిగిపోతాయని, ఎంతో మంచి జరుగుతుందని ఆ యువతి తెలియజేసిందట. దీంతో ఆ మాటలకు కన్విన్స్ అయిన త్రిష.. ఎలాంటి ఆలస్యం చేయకుండా బ్యాంకాక్ పూజలు పూర్తి చేసిందని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు త్రిష ఏకంగా ఏడు క్రేజీ ప్రాజెక్టులను అధికారికంగా లైన్ లో పెట్టిందని, రీసెంట్ గా స్టార్ హీరోల సరసన లక్కీ ఛాన్సులు కొట్టేసిందని, ఇదంతా బ్యాంకాక్ దేవుడి మహిమేనని కోలీవుడ్ మీడియా ఇంట్రెస్టింగ్ గా చెబుతోంది.

(Visited 39 times, 1 visits today)

Related Post