2016 సంవత్సరానికి గాను బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లు  సాధించిన చిత్రాలు 

 

1. జనతా గ్యారేజ్ 

నటి నటులు: ఎన్.టి.ఆర్. (తారక్), మోహన్‌లాల్‌, సమంత

డైరెక్టర్: కొరటాల శివ

బడ్జెట్: 40-50 కోట్లు

కలెక్షన్స్: 130 కోట్లు

కథ:

సత్యం (మోహన్‌లాల్‌) ఓ మెకానిక్‌. తమ్ముడు (రెహమాన్‌)తో పాటు హైదరాబాద్‌లో ఓ గ్యారేజ్‌ నడుపుతుంటాడు. దాని పేరే ‘‘జనతా గ్యారేజ్‌ ‘. అక్కడికి సమస్య అంటూ ఎవరొచ్చినా దానికి పరిష్కారం చూపిస్తుంటారు. దాంతో సత్యంకి శత్రువులు పెరుగుతారు. వాళ్లు చేసిన దాడిలో తమ్ముడ్ని కోల్పోతాడు. తమ్ముడు కొడుకు ఆనంద్‌ (ఎన్టీఆర్‌)ని మాత్రం చిన్నప్పుడే ఈ జనతా గ్యారేజ్‌కి దూరంగా పెంచడానికి మేనమామ (సురేష్‌)కి ఇచ్చి ముంబై పంపించేస్తాడు. ఆనంద్‌కి అసలు తనకంటూ ఓ కుటుంబం ఉందని కూడా తెలియకుండా పెంచుతాడు మేనమామ. ఆనంద్‌కి ప్రకృతి అంటే ఇష్టం. చిన్న మొక్కకి హాని జరిగినా తట్టుకోలేడు. అందుకోసం ఎంతమందినైనా ఎదిరిస్తాడు. తనకీ ముంబైలో శత్రువులు పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల ఆనంద్‌ తొలిసారి హైదరాబాద్‌ రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక సత్యంని కలుస్తాడు. దానికి కారణం ఏమిటి? సత్యం తన పెదనాన్న అని ఆనంద్‌కు తెలిసిందా? లేదా? జనతా గ్యారేజ్‌కి ఆనంద్‌ అవసరం ఏమొచ్చింది? ఇలాంటి విషయాలన్నీ కథలో కొనసాగుతాయి.

2. సరైనోడు 

నటి నటులు: అల్లు అర్జున్‌, ఆది పినిశెట్టి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌
డైరెక్టర్: బోయపాటి శ్రీను
బడ్జెట్: 50 కోట్లు
కలెక్షన్స్: 127 కోట్లు

కథ

అయిల్ కంపెనీ కోసం పేద రైతుల దగ్గర భూములను లాక్కుంటుంటాడు వైరం ధనుష్(ఆది పినిశెట్టి). ముఖ్యమంత్రి కొడుకు కావడం, అంగ, ఆర్ధిక బలం ఉండటంతో ఎవరూ ఏమీ అనలేరు. కథ ఇలా సాగుతుండగా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఉమాపతి(జయప్రకాష్) తనయుడు గణ(బన్ని) మిలటరీ నుండి పని మానేసి వచ్చేస్తాడు. ఉమాపతి తమ్ముడు శ్రీపతి(శ్రీకాంత్), గణను స్వంత కొడుకులా పెంచుకుంటుంటాడు.గణ కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే రకం కాదు. ఫలితంగా ఊర మాస్గా తయారవుతాడు. దివ్య (కేథరీన్) ఎమ్మెల్యే కూతురు. తండ్రి హత్య అనంతరం ఎమ్మెల్యేగా ఎన్నికవుతుంది. ఎమ్మెల్యే దివ్యను ప్రేమిస్తాడు గణ.

ఆమె కూడా గణను ఇష్టపడుతుంది. పెళ్లికి ఇరు కుటుంబాల ఆమోదం లభిస్తుంది. అయితే ఈ పెళ్లి జరగాలంటే తనకో ప్రామిస్ చేయాలంటూ షరతు పెడుతుంది దివ్య. ఇక మీదట ఎలాంటి గొడవలకు వెళ్లనని ఒట్టేస్తే తప్ప పెళ్లికి ఒప్పుకునేది లేదంటుంది. ఆమెకు ప్రామిస్ చేస్తున్న సమయంలోనే మహాలక్ష్మి(రకుల్ ప్రీత్ సింగ్)మరో సమస్యతో అక్కడికి వస్తుంది… ధనుష్ అనుచరులు చంపడానికి వస్తారు. వారి నుండి గణ మహాలక్ష్మిని కాపాడతాడు. అసలు మహాలక్ష్మి ఎవరు? ధనుష్, మహాలక్ష్మి మధ్య రిలేషన్ ఏంటి? చివరకు గణ మహాలక్ష్మిని ఎలా కాపాడాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

3. సర్దార్ గబ్బర్ సింగ్

నటి నటులు:  పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్, శరద్ కేల్కర్

డైరెక్టర్: కె. ఎస్. రవీంద్ర

బడ్జెట్: 50 కోట్లు

కలెక్షన్స్: 100 కోట్లు

కథ:

రతన్ పూర్ తెలుగు రాష్ట్ర సరిహద్దులోని ప్రాంతం. ఇప్పటికీ రాజరికపు వ్యవస్థ పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, ఆ రాజవంశీకుల కనుసన్నల్లోనే నడుస్తుంటారు. రాజుగారు చనిపొవటవంతో రాజవంశానికి చెందిన మూడు కుటుంబాలు అధికారం, ఆస్తుల కోసం పోటీపడతాయి. దుర్మార్గుడైన భైరవ్(శరద్ కేల్కర్) తన బలం, బలగంతో ఊరి ప్రజలను బయపెట్టి వ్యాపారం చేస్తుంటాడు. కానీ రాజుగారి వారసురాలు ఆర్శి దేవి( కాజల్ అగర్వాల్) ఉన్న ఆస్తులను అమ్మి తన తండ్రి ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంటుంది. రాజవంశానికి దళపతి అయిన హరినారాయణ (ముఖేష్ రుషి) ఆమెకు సాయంగా భైరవ్ నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా కాపాడుతుంటాడు.

రాజకుంటుంబాన్ని, ఆ ఊరి ప్రజలను భైరవ్ భారీ నుంచి కాపాడే సరైన వ్యక్తి కోసం హరినారాయణ ఎదురు చూస్తుంటారు. ఆ సమయంలో అతడి స్నేహితుడైన పోలీస్ అధికారి, రతన్ పూర్కు సిఐగా కండబలం, బుద్ధిబలం ఉన్న సర్దార్ గబ్బర్సింగ్(పవన్ కళ్యాణ్)ను పంపిస్తాడు. అనాథగా పెరిగిన సర్దార్, అతని స్నేహితుడు సాంబా ఓ పోలీస్ అధికారి సాయంతో డిపార్ట్ మెంట్ లో చేరతారు. ఎవరి మాట వినకుండా మొండిగా వ్యవహరించే సర్దార్, రతన్ పూర్లో అడుగుపెట్టిన తరువాత తొలిసారిగా భైరవ్కు ఎదురు నిలబడే వాడు ఒకడు వచ్చాడన్న ధైర్యం, ఆ ఊరి జనంలో కనిపిస్తుంది.

అదే సమయంలో రాజకుమారిని ఆ ఇంటి పనిమనిషిగా భావించిన ప్రేమలో పడతాడు సర్దార్. అదే రాకుమారిని తన సొంతం చేసుకొని రాజవంశానికి చెందిన మొత్తం ఆస్తిని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు భైరవ్. అలా డ్యూటీ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా భైరవ్, సర్దార్ల మధ్య యుద్ధం మొదలవుతుంది. మరి ఈ యుద్ధంలో ఎవరు ఎలా దెబ్బకొట్టారు. చివరకు భైరవ్ సామ్రాజ్యాన్ని సర్దార్ ఎలా కూల్చేశాడు అన్నదే మిగతా కథ.

4. ధృవ

నటి నటులు: రామ్‌ చరణ్‌, అరవింద్‌ స్వామి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌

డైరెక్టర్: సురేందర్‌ రెడ్డి

బడ్జెట్:  50కోట్లు 

కలెక్షన్స్:  89 కోట్లు 

కథ:

ధృవ(రామ్చరణ్).. దేశంలో జరిగే అన్యాయాలను అంతం చేయాలన్న ఆశయంతో ఐపీఎస్‌ లో జాయిన్ అయిన కుర్రాడు. నీ శత్రువు గురించి తెలిస్తే నీ స్టామినా ఏంటో తెలుస్తుంది అనే మనస్థత్వం కలిగిన కుర్రాడు. అదే బ్యాచ్ లో తనలాంటి భావాలున్న వ్యక్తులతో కలిసి రాత్రుళ్లు కొన్ని కేసులకు సంబంధించిన నేరస్తులను పోలీసులకు పట్టిస్తుంటాడు. అంతేకాదు తాను చూసిన ప్రతీ కేసు వెనుక ఉన్న నిజానిజాలను ఎంక్వైరీ చేసి ఆ నేరాల వెనుక ఉన్న అసలు నేరస్తులను పట్టుకోవాలని భావిస్తాడు. ధీరజ్ చంద్ర, జయంత్ సూరి, ఇర్ఫాన్ అలీ అనే వ్యక్తులు హైదరాబాద్ లో జరిగే నేరాలకు ముఖ్య కారకులని తెలుసుకున్న ధృవ, వీళ్లలో అందరికంటే బలమైన నేరస్తుడ్ని తన టార్గెట్ గా ఫిక్స్ చేసుకోవాలనుకుంటాడు.

అప్పుడే ఈ ముగ్గురు వెనకాల ఉన్నది ఒకే వ్యక్తి అన్న నిజం తెలుస్తుంది. ప్రఖ్యాత సైంటిస్ట్ గా, సమాజంలో పెద్ద మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ అభిమన్యు (అరవింద్ స్వామి) ఈ ముగ్గురినీ బినామీలుగా పెట్టుకొని నేరాలు చేస్తున్నాడని తెలుసుకుంటాడు. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే మందులను అందించే అగ్రిమెంట్ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకుంటాడు సిద్దార్థ్. ఈ విషయం తెలుసుకున్న ధృవ… సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ అంత ఈజీగా పట్టుబడ్డాడా..? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ.

5. ఊపిరి

 నటి నటులు: అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్

డైరెక్టర్: వంశీ పైడిపల్లి

బడ్జెట్: 50 కోట్లు

కలెక్షన్స్: 80 కోట్లు

కథ:

శ్రీను (కార్తి ) చిన్నప్పుడే తల్లిదండ్రులు ఓ ఆక్సిడెంట్ లో చనిపోవడంతో తన పిన్ని జయసుద పెంచిపోషిస్తుంది. అప్పటికే జయసుదకు ఇద్దరు పిల్లలు ఉండడం, ఆమె సంపాదన తోనే ఈ ముగ్గురు పిల్లలు పెరుగుతూ వచ్చారు. అదే టైం లో శ్రీను ఎలాగైన ఆమెకు ఏదో విధంగా సాయం చేయాలని భావించి , చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఓ రోజు పోలీసులకు పట్టుపడి జైలుకెళ్తాడు. పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీనుని తల్లి (జయసుథ) ఇంట్లో నుంచి గెంటేస్తుంది. సత్ప్రవర్తన కలిగిన వాడిగా చూపించుకొని కేసునుంచి బయటపడేందుకు ప్రయత్నం చేస్తాడు శ్రీను. అందుకోసం అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో పని చేయడానికి ప్రయత్నించినా అది కుదరదు. దీంతో మల్టీ మిలియనీర్ విక్రమాదిత్య (నాగార్జున)కు కేర్ టేకర్ కోసం జరుగుతున్న ఇంటర్వ్యూకు వెళతాడు. అక్కడ విక్రమాదిత్య.. సెక్రటరీ కీర్తి(తమన్నా)ని చూసి ఎలాగైనా అక్కడే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటాడు.

విక్రమాదిత్య (నాగార్జున ) ఓ పెద్ద బిజినెస్ మాన్, అంతే కాదు ఇతనికి పెయింటింగ్ అంటే ప్రాణం. మంచి మంచి పెయింటింగ్ లను కొంటు ఉంటాడు..5 ఏళ్ల క్రితం ఓ ఆక్సిడెంట్ వల్ల అతని ఒంట్లోని అవయవాలు ఏమి పనిచేయవు. దీంతో అతడి లైఫ్ అంత ఓ వీల్ చైర్ తోనే సాగిపోతుంది. అదే టైం లో అతడిని చూసుకోవడానికి ఓ వ్యక్తి ని సెలెక్ట్ చేయమని తన అసిస్టెంట్ కీర్తి (తమన్నా ) కు చెపుతాడు. అప్పుడు ఆమె శ్రీను ను సెలెక్ట్ చేస్తుంది.
అప్పటి నుండి విక్రమాదిత్య కు ఏం ఇష్టమో తెలుసుకొని శ్రీను అన్ని చేస్తుంటాడు.ఎలాంటి బాధ్యత తెలియని శ్రీను, విక్రమాదిత్య మనోవేదనను ఎలా పోగొట్టాడు? అదే సమయంలో కీర్తి ప్రేమను గెలుచుకోవడానికి శ్రీను ఎలాంటి ప్రయాత్నాలు చేశాడు..? శ్రీను జీవితంలోని సమస్యలను విక్రమాదిత్య ఎలా పరిష్కరించాడు అన్నదే మిగతా కథ..?

 6. నాన్నకు ప్రేమతో

నటి నటులు: ఎన్.టి.ఆర్. (తారక్), రకుల్ ప్రీత్ సింగ్

డైరెక్టర్: సుకుమార్

బడ్జెట్: 40 కోట్లు 

కలెక్షన్స్: 87 కోట్లు 

కథ

అభిరామ్ (ఎన్టీఆర్) లండన్లో ఓ కంపెనీలో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తిగా పరిచయం అవుతాడు. తొలి సన్నివేశం లోనే తన భావోద్వేగాలనును దాచుకోకుండా బయటపెట్టేసే వ్యక్తిగా కనిపిస్తాడు అభిరామ్. ఉద్యోగం పోవటంతో తన లాంటి ఎంతోమంది నిరుద్యోగులతో కలిసి కెయంసీ పేరుతో ఓ కొత్త సంస్థ ప్రారంభిస్తాడు. అదే సమయంలో తన తండ్రి సుబ్రమణ్యం (గద్దె రాజేంద్ర ప్రసాద్ )కు సీరియస్ గా ఉందని తెలియటంతో ఇంటికి వస్తాడు. తన అన్నదమ్ముల (రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్) ఇంట్లో తండ్రిని కలుసుకున్న అభిరామ్, ఆఖరి క్షణాల్లో ఆయన్ని ఆనందంగా ఉంచాలనుకుంటాడు. కోటీశ్వరుడైన రమేష్ చంద్ర ప్రసాద్, సుబ్రమణ్యంగా పేరు మార్చుకోవడానికి కారణమైన కృష్ణమూర్తి కౌటిల్య (జగపతిబాబు) పతనమే తన తండ్రికి ఆనందాన్ని ఇస్తుందని తెలుసుకొని కృష్ణమూర్తి పని పట్టడానికి బయలుదేరుతాడు.

ఈ క్రమంలో లో తనకు సాయం చేయటం కోసం కృష్ణమూర్తి వల్లే నష్టపోయిన మరో ముగ్గురిని ఎంపిక చేసుకుంటాడు. కృష్ణమూర్తిని దెబ్బకొట్టాడానికి అన్నింటికన్నా సులభమైన మార్గం అతని కూతురిని ప్రేమించటమే అని దివ్యాంక (రకుల్ ప్రీత్ సింగ్)ను ప్రేమలోకి దించుతాడు. ఆ తరువాత కృష్ణమూర్తిని ఓడించడానికి అభిరామ్ ఎత్తులు, అభిరాంను ఎదుర్కొనటానికి కృష్ణమూర్తి పై ఎత్తులు, చివరకు కృష్ణమూర్తి పై అభిరామ్ ఎలా పై చేయి సాధించాడు అన్నదే మిగతా కథ.

7. అ ఆ

నటి నటులు: నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్

డైరెక్టర్: త్రివిక్రం శ్రీనివాస్

బడ్జెట్: 35 కోట్లు

కలెక్షన్స్: 75 కోట్లు 

కథ:

రామలింగం (నరేష్), మహాలక్ష్మి (నదియా)ల కూతురు అనసూయ (సమంత) ఎంట్రీతో సినిమా మొదలవుతోంది. తన జీవితంలో ప్రతి నిర్ణయం తన తల్లే తీసుకుంటుందన్న బాధలో ఉంటుంది అనసూయ. తన 23వ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ, ఓ కోటీశ్వరుడు మనవడితో అనుసూయకు పెళ్ళిచూపులు ప్లాన్ చేస్తుంది. ఆ నిర్ణయం నచ్చక అనసూయ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తిరిగి అమ్మ చేతిలో తిట్లు తింటుంది. అదే సమయంలో మహాలక్ష్మి వ్యాపార పని మీద చెన్నై వెళ్లటంతో తండ్రి సాయంతో ఆ పెళ్ళి చూపులను రద్దు చేయిస్తుంది అనసూయ. మహాలక్ష్మి ఇంట్లో లేని సమయాన్ని ఆనందంగా గడపటం కోసం విజయవాడ దగ్గర కల్వపూడిలో ఉంటున్న మేనత్త కామేశ్వరి (ఈశ్వరీ రావ్) ఇంటికి వెళుతుంది.

నగరంలో డాబుగా పెరిగిన అనసూయ అవసరాలు తీర్చటం, కామేశ్వరి కొడుకు ఆనంద్ విహారి (నితిన్)కి తలకు మించిన భారం అవుతుంది. అక్కడ ఉన్న పదిరోజుల్లో కుటుంబ బంధాల విలువ తెలుసుకుంటుంది అనసూయ. అదే సమయంలో ఆనంద్ విహారితో ప్రేమలో పడుతుంది. కానీ ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆనంద్ తన ప్రేమను బయటకు చెప్పలేకపోతాడు. అసలు మహాలక్ష్మి, కామేశ్వరిల కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి..? పల్లం వెంకన్న (రావు రమేష్)కు ఆనంద్ విహారికి సంబంధం ఏంటి..? చివరికి ఆనంద్ విహారి అనసూయ రామలింగాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్నదే మిగతా కథ.

8. సోగ్గాడే చిన్ని నాయన

నటి నటులు: అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి

డైరెక్టర్: కల్యాణ్‌ కృష్ణ

బడ్జెట్: 45 కోట్లు 

కలెక్షన్స్: 75 కోట్లు 

కథ:

గోదావరి జిల్లాల్లో శివపురంకు చెందిన బంగార్రాజు(నాగార్జున) గురించి తెలియని వారుండరు. అమ్మాయిలు ఆయనంటే పడి చస్తాడు. సోగ్గాడిగా పేరు తెచ్చుకుంటాడు. ఓ యాక్సిడెంటులో బంగార్రాజు చనిపోతాడు. ఆయన కొడుకు డా. రామ్ (నాగార్జున) అమెరికాలో కార్డియాలజిస్టుగా పని చేస్తుంటాడు. కుటుంబం కంటే పనినే ఎక్కువ ప్రేమిస్తాడు. దీంతో అతని భార్య సీత (లావణ్య త్రిపాఠి) భర్త తీరుపై అసంతృప్తిగా ఉంటుంది. ఓ రోజు ఇద్దరూ ఉన్నట్టుండి సొంతూరు శివపురంకు వస్తారు. వచ్చిన తర్వాత విషయాన్ని రామ్ తల్లి, తన అత్తగారైన సత్యభామ (రమ్యకృష్ణ) చెబుతుంది. అతనితో తాను కాపురం చేయలేనని, విడాకులు కావాలని అంటుంది. కోడలు చెప్పిన మాటవిని షాకవుతుంది సత్యభామ. కొడుకు తన భర్త బంగార్రాజు(నాగార్జున)లా కాకూడదని పద్దతిగా పెంచితే చివరకి ఇలా అయిందే అని భాధ పడుతుంటే ఉన్నట్టుండి బంగార్రాజు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. వీరిద్దరూ కలిసి తమ కొడుకు కాపురాన్ని ఎలా సరిద్దారు? బంగార్రాజు చావుకు కారణమేంటి? అనేది తర్వాతి కథ.

9. నేను శైలజ 

నటి నటులు: రామ్‌, కీర్తి సురేష్‌, సత్యరాజ్‌,

డైరెక్టర్: కిషోర్‌ తిరుమల

బడ్జెట్: 20 కోట్లు

కలెక్షన్స్: 50 కోట్లు

కథ:

హరి(రామ్) కి చిన్నప్పటినుంచీ కనపడ్డ అమ్మాయికల్లా ప్రపోజ్ చేయటం..నో చెప్పించుకోవటం అలవాటే. ఇలా రొటీన్ గా నో చెప్పించుకుంటున్న హరికి అదే ఊళ్లో ఉంటున్న శైలజ పరిచయం అవుతుంది. ఆమెను చిన్నప్పుడే ఇంప్రెస్ చేసిన హరి…తర్వాత అతని కుటుంబం వేరే ఊరికి షిప్ట్ అవటంతో దూరం అవుతాడు. ఈ మనసంతా నువ్వే లవ్ స్టోరీ …వీళ్లిద్దరూ పెద్దవాళ్లయ్యాక మళ్లీ మొదలవుతుంది. పెరిగి పెద్దైన శైలజ (కీర్తి సురేష్) అతనికి అనుకోకుండా కనిపిస్తుంది. ఆమెను పరిచయం చేసుకుని, ఇంప్రెస్ చేసి, ట్రై చేసి ప్రపోజ్ చేస్తాడు. అయితే శైలజ…ఐ లవ్ యు..బట్ ఐ యామ్ నాట్ లవ్ విత్ లవ్ యు అని కన్ఫూజ్ డైలాగు చెప్పి..దూరం అయిపోతుంది. ఆమె అలా ఎందుకు హరికి కన్ఫూజ్ డైలాగు చెప్పింది. ఆమెకు ఏదన్నా సమస్య ఉందా…ఉంటే హరి దాన్ని ఎలా తీర్చాడు…ఆమె ప్రేమను ఎలా పొందాడు అనే విషయాలుతెలియాలంటే…ఈ హరి కథ మీరు తెరపై చూడాల్సిందే.

10. పెళ్ళి చూపులు

Pelli Choopulu

నటి నటులు: విజయ్ దేవరకొండ, రీతు వర్మ

డైరెక్టర్: తరుణ్ భాస్కర్ దాస్యం 

బడ్జెట్: 1.5 కోట్లు 

కలెక్షన్స్: 40 కోట్లు 

కథ:

ప్రధాన పాత్రలైన ప్రశాంత్ (విజయ్ దేవరకొండ), చిత్ర (రీతు వర్మ) పెళ్ళిచూపుల్లో కలవడంతో సినిమా ప్రారంభమవుతుంది. ప్రశాంత్ ఇంజనీరింగ్ చదువుకున్నా బద్ధకంతోనూ, జీవితంలో ఏం చేయాలన్నదానిపై స్పష్టత లేకపోవడంతోనూ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటాడు. షెఫ్ (chef)గా కెరీర్ ప్రారంభించి ఓ రెస్టారెంట్ ప్రారంభించాలన్నది అతని కల. చిత్ర చాలా స్పష్టత ఉన్న అమ్మాయి, జీవితంలో ఏం సాధించాలన్న దానిపై సుస్పష్టమైన దృష్టితో తన కలలు నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఐతే ఆమె ఓ అబ్బాయితో ప్రేమలో పడి, అతనితో కలిసి రెస్టారెంట్ ఆన్ వీల్స్ (ఫుడ్ ట్రక్) ప్రారంభించి తన కల నెరవేర్చుకుందామని ఆశిస్తుంది. కానీ అతను ఆమెను విడిచిపెట్టేసి, వేరే సంబంధానికి ఒప్పుకోవడంతో చిత్ర తండ్రి ఆమెను సీరియస్ గా తీసుకోవడం మానేస్తాడు. పెళ్ళి సంబంధాలు చూస్తూ ఉంటాడు. ఆమెకు ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి తగ్గ డబ్బు తానే సంపాదించుకోవాలని అనుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్, చిత్ర పెళ్ళి చేసుకున్నారా? వారి ఆశలు, కలలు ఏమయ్యాయి అన్నది మిగతా కథ.

(Visited 1,038 times, 1 visits today)

Related Post