ప్రతి సంవత్సరం సమ్మర్‌కు టాలీవుడ్‌లో భారీ చిత్రాల‌తో బాక్సాఫీస్ క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే 2017 స‌మ్మ‌ర్‌కు టాలీవుడ్‌లో ఏకంగా రూ.700 కోట్ల బిజినెస్ జ‌రుగుతోంది. ముందుగా ఈ నెల చివ‌రి వారంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కాట‌మ‌రాయుడు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా రూ.100 కోట్ల వ‌సూళ్లు సాధించాల్సి ఉంది. ఆ త‌ర్వాత మంచి స్పీడ్ మీద ఉన్న శ‌ర్వానంద్ రాధా వ‌స్తోంది.

READ MORE: కాటమరాయుడు మూవీ టీజర్

ఇక ఏప్రిల్ 7న విక్ట‌రీ వెంక‌టేష్ గురు, అదే రోజున కార్తీ నటించిన మణిరత్నం మూవీ చెలియా కూడా విడుదల అవుతోంది….అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తుండడంతో.. చెలియా కూడా భారీగా రిలీజ్ అవడం ఖాయమే. అదే రోజున అల్లు శిరీష్ న‌టించ‌న మ‌ళ‌యాళ మూవీ 1971 బెయాండ్ బోర్డర్స్ కు డబ్బింగ్ వెర్షన్ అయిన 1971 భారత సరిహద్దు కూడా విడుదల కానుంది.

మరోవైపు ఏప్రిల్ సెకండ్ వీక్‌లో ఏప్రిల్ 14న వ‌రుణ్ తేజ్ – శ్రీను వైట్ల‌ల మిస్ట‌ర్ రిలీజ్ అవుతోంది. ఆ త‌ర్వాత ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 వ‌స్తోంది. ఈ సినిమా ఒక్క‌టే రూ.400 కోట్ల వ్యాపారం చేస్తోంద‌ని ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నా. బాహుబలి2 తర్వాత మే 12న నిఖిల్ నటించిన కేశవ వస్తోంది. ఇక మే 19న అల్లు అర్జున్ – హ‌రీష్ శంక‌ర్ దువ్వాడ జ‌గ‌న్నాథం వ‌స్తోంది. ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌గా..ఈ సినిమ దాదాపు రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంద‌ని అంచ‌నా.

వీటితో పాటు వ‌రుణ్ తేజ్ – శేఖ‌ర్ ఖ‌మ్ముల ఫిదా, నాని మ‌రో సినిమా కూడా రిలీజ్ కానున్నాయి. వీటితో పాటు ఇంకా చిన్న సినిమాలు క‌లుపుకుంటే మొత్తమ్మీద ఈ స‌మ్మ‌ర్‌లో టాలీవుడ్‌లో ఏకంగా రూ.700 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జ‌రుగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

READ MORE: రాజమౌళికి రెండు భారీ ఆఫర్లు..?

(Visited 118 times, 1 visits today)

Related Post