అక్కినేని నాగార్జున అల్లుడు, హీరో సుశాంత్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ తండ్రి అనుమోలు సత్యభూషణ రావు(68) మృతి చెందారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. సత్యభూషణ రావు మృతితో అక్కినేని ఇంట కూడా విషాదం నెలకొంది. విషయం తెలుసుకొన్న సినీ ప్రముఖులు సుశాంత్ తండ్రి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ దంపతుల రెండో కుమార్తె నాగ సుశీలను సత్యభూషణ రావు వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

(Visited 383 times, 1 visits today)

Related Post