విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2017

దర్శకత్వం: పి. వాసు 

నటీనటులు: రాఘవ లారెన్స్, రితిక సింగ్, శక్తి 

నిర్మాత: ఆర్. రవీంద్రన్ 

సంగీతం: యస్. యస్. థమన్ 

‘కాంచన’, గంగా లాంటి సూపర్ హిట్ సినిమాల్తో తెలుగులో తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న లారెన్స్, ‘చంద్రముఖి’ లాంటి సెన్సేషన్ హారర్ సస్పెన్స్ అందించిన దర్శకుడు పి. వాసు…. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా, అది కూడా హారర్ కామెడీ అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కడో ఉంటాయి. మరి అలాంటి భారీ అంచాలతో ‘శివలింగ’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ:

ఈ సినిమా మొత్తం రహీమ్ అనే వ్యక్తి హత్య కేసు చుట్టూ తిరుగుతుంటుంది. ఈ చిత్రం లో శివలింగ (లారెన్స్) ఒక సీబీ. సీఐడి ఆఫీసర్ గా కనిపిస్తాడు. అనుకోకుండా ఈ కేసును శివలింగ టేకప్ చేస్తాడు. ఆ సమయం లోనే శివలింగకి సత్య(రితిక సింగ్ )కి పెళ్లి జరుగుతుంది. పెళ్లి తర్వాత సత్య ప్రవర్తనలో మార్పు వస్తుంది. తను వేరే మనిషిల ప్రవర్తిస్తుంది. అసలు ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తుంది….? తనకి రహీమ్ హత్య కి సంబంధం ఉందా…?ఉంటే అది ఎలాంటి సంబంధం…? అసలు రహీమ్ నీ ఎవరు చంపారు…? అసలు రాఘవ ఈ కేసుని ఎలా పరిష్కరిస్తాడు…? అనే విషయాలు తెలియాలంటే మాత్రం తెరపై చూడాల్సిందే.

READ MORE: మిస్టర్ మూవీ రివ్యూ మరియు రేటింగ్

ఎలా ఉందంటే..?:

సీబీ సిఐడి ఆఫీసర్ పాత్రలో రాఘవ లారెన్స్ ఎప్పటిలాగానే అదరగొట్టాడు. పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా, యాక్షన్ పరంగా ఎక్కడా వంకపెట్టడానికి లేదు. గురు సినిమాలో బాక్సర్ గా కనిపించి రితిక సింగ్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపించింది. హారర్ సన్నివేశాల్లో రితిక సింగ్ బాగానే ఆకట్టుకుంది. పైగా ఈ సినిమాలో రితిక డాన్స్ లు బాగానే చేసింది. మరో వైపు గ్లామర్ పాత్రలోను బాగానే నటించింది.

శివ లింగ తల్లి పాత్రలో ఊర్వశి, కామెడీ దొంగ పాత్రలో వడివేలు, రాధారవి, భానుప్రియ, జయప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు  పరవాలేదనిపించారు. ఆత్మ పాత్ర పోషించిన శక్తి నటన సినిమాకి కొంత ప్లస్ గా చెప్పుకోవచ్చు. అక్కడక్కడా వచ్చే కామెడీ సన్నివేశాలు బాగానే ఆకట్టుకుంటాయి…. కానీ హారర్ సీన్లకు కామెడీ మిక్స్ చేసినపుడే ప్రేక్షకుడు థ్రిల్ అవుతారు. కానీ సినిమాకు అది మైనస్సు అయింది.

దర్శకుడు వాసు కథలో కొత్తదనం ఉన్నా…. అది చూపించిన విధానం మాత్రం పాతగానే ఉంది. తమన్ అందించిన సంగీతం యావరేజ్ గా ఉన్నా…. బ్యాగ్కౌండ్ స్కోర్ బావుంది. సర్వేష్ మురారి సినిమాటోగ్రఫీ పరవాలేదనిపించింది. హారర్ సీన్లలో గ్రాఫిక్స్ బాగుంది. నిర్మాణ విలువులు బావున్నాయి. సురేష్ ఎడిటింగ్ యావరేజ్ గా ఉంది.

చివరగా…థ కొత్తదే కానీ అందులోని దెయ్యాలే పాతవి.

బలాలు:

  • లారెన్స్ పెర్ఫార్మెన్స్
  • బ్యాగ్రౌండ్ స్కోర్
  • క్లైమాక్స్
  • రితిక పెర్ఫార్మెన్స్

బలహీనతలు:

  • చాల అనవసరపు సన్నివేశాలు
  • నేమ్మదిగా సాగే కధనం

రేటింగ్: 2.75/5

(Visited 3,190 times, 1 visits today)

Related Post