కన్నడ ప్రజలకు సత్యరాజ్‌ (కట్టప్ప) క్షమాపణలు చెప్పాడు. కర్ణాటకకు, కన్నడిగులకు తాను వ్యతిరేకం కాదని సత్యరాజ్ స్పష్టం చేశాడు. తొమ్మిదేళ్ల క్రితం కొన్ని వ్యాఖ్యలు చేశానని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని సత్యరాజ్ కోరాడు. ఎవరి వ్యాఖ్యలు సినిమాను ప్రభావితం చేయకూడదని, తన వల్ల బాహుబలి2 విడుదలకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఆయన చెప్పాడు.

READ MORE: లంక మూవీ రివ్యూ మరియు రేటింగ్

సత్యరాజ్ క్షమాపణ చెప్పాలన్నదే కన్నడీగుల డిమాండ్. వారి డిమాండ్‌కు తలొగ్గిన సత్యరాజ్ క్షమాపణలు చెప్పడంతో కర్ణాటకలో బాహుబలి2 సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్లేనని చెప్పాలి. మొత్తానికి మొన్న తమిళనాడులో ఇవాళ కన్నడలో వివాదం తొలగడంతో బాహుబలి టీం సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది.

READ MORE: బ్లాక్ మనీ మూవీ రివ్యూ మరియు రేటింగ్

Related Post

Comments

comments