ఎవరికైనా సినిమా చేస్తానని మాటిస్తే వాళ్ళ ప్రస్తుత పొజిషన్‌ ఏంటి అనేది పట్టించుకోకుండా సినిమా చేసేయడం పవన్‌కళ్యాణ్‌కి అలవాటు. అప్పటికి అతనెవరో కూడా జనం మర్చిపోయిన దశలో భీమనేని దర్శకత్వంలో ‘అన్నవరం’ చేసాడు. కేవలం తనతో మరో సినిమా చేస్తానని ‘సుస్వాగతం’ టైమ్‌లో మాటిచ్చినందువల్లే పవన్‌ అతడిని దర్శకుడిగా పెట్టుకున్నాడు.

అలాగే చాలా మంది నిర్మాతలు, దర్శకులకి పవన్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. అలాంటిది సంపత్‌ నందిని మాత్రం అన్నేళ్లు ఊరించి పవన్‌ ఎందుకు పంపేసాడు? కారణం ఏమిటనేది అటు పవన్‌ కానీ, ఇటు సంపత్‌ కానీ చెప్పడం లేదు కానీ ఆరా తీస్తే అందుకు కారణం సంపత్‌ తీసిన ‘గాలిపటం’ సినిమా అని తెలిసింది.

గాలిపటం సినిమాకి స్క్రిప్ట్‌ అందించిన సంపత్‌ నంది నిర్మాతగా కూడా వ్యవహరించాడు. దర్శకుడు మరెవరో అయినా కానీ నిజానికి అది సంపత్‌ నంది డైరెక్ట్‌ చేసాడట. ఆ సినిమాతో అతనిపై బ్యాడ్‌ ఇంప్రెషన్‌ పడడం, తన సినిమా మొదలయ్యే వరకు ఆగలేక సంపత్‌ ఇలా ఒక అడల్ట్‌ కామెడీ చేయడం పవన్‌కి నచ్చలేదట.

అటు గబ్బర్‌సింగ్‌ 2 మేకర్స్‌ కూడా సంపత్‌ ఇలా ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసుకోవడాన్ని హర్షించలేదట. అలా సంపత్‌ తొందరపాటు వ‌ల‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ ను పొగొట్టుకున్నాడంటున్నారు. అయితే ప‌వ‌న్ కాద‌న్న త‌రువాత‌… త‌ను ర‌వితేజ తో చేసిన బెంగాల్ టైగ‌ర్ స‌గ‌టు చిత్రంగా నిలిచిందే త‌ప్ప‌.. పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజ్ లో మాత్రం లేదు.

Related Post

Comments

comments