Click for: Rogue Review in English

విడుదల తేదీ: మార్చ్ 31, 2017

దర్శకత్వం: పూరి జగన్నాథ్‌ 

నటీనటులు: ఇషాన్‌, మన్నారా చోప్రా, ఏంజెలా, పోసాని కృష్ణమురళి, ఠాకూర్‌ అనూప్‌సింగ్‌

నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి 

సంగీతం: సునీల్‌ కశ్యప్‌

పూరి సినిమా అనగానే జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులు బాక్సాఫీస్‌ వైపు ఆసక్తిగా చూస్తుంటారు. అందుకు కారణం పూరి కథలు, ఆయన సినిమాల్లోని హీరోయిజమే. ఎప్పుడు ఎలాంటి కథతో వస్తారో..పూరి కథానాయకుడు తెరపై ఏ రకంగా కనిపిస్తాడో వూహించలేం. ఈసారి ఇషాన్‌ అనే ఓ కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ మరో చంటిగాడి ప్రేమకథగా ‘రోగ్‌’ తెరకెక్కించారు పూరి. చంటిగాడి ప్రేమ కథ అంటూ ఇది వరకు రవితేజని ‘ఇడియట్‌’గా చూపించారు పూరి. మరి ఈ సారి ఈ యంగ్ హీరోని ఎలా చుపించాడో ఇప్పుడు చూద్దాం.

కథ:

చంటి(ఇషాన్‌) ఎవరికీ భయపడని ఓ మంచి ప్రేమికుడు. కమిషనర్‌ కూతురు అంజలి(ఏంజెలా)ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు… తనకోసమే జైలుకి వెళ్తాడు. కానీ అంజలి మాత్రం ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటుంది. అప్పటి నుంచి అమ్మాయిలంటేనే అసహ్యించుకుంటుంటాడు చంటి. అలాంటి కుర్రాడి జీవితంలోకి మరో అంజలి(మన్నారా) ఎలా వచ్చింది. ఆమెను చంటి ప్రేమించాడా? లేదా! ఆ ఇద్దరూ కలవడంలో సైకో(అనూప్‌ సింగ్‌) ఎలాంటి పాత్ర పోషించాడు. అసలు సైకో ఎవరు? అసలు అంజలి కి సైకో కి ఏంటి సంబంధం! అసలు చివరికి ఎంజరిగింది ? అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

READ MORE: గురు మూవీ రివ్యూ మరియు రేటింగ్

ఎలా ఉందంటే..?:

పూరి జగన్నాథ్‌ సినిమా అనగానే ఆయన శైలి హీరోయిజం, డైలాగ్స్ గుర్తుకొస్తాయి. మరోసారి ఆ విషయాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టి ‘రోగ్‌’ తీశారు పూరి. కథ, కథనాలు మాత్రం ఎప్పటిలాగానే అనిపిస్తాయి. పేరుకు ప్రేమ కథే కానీ ఇందులో మాస్‌ అంశాలే ఎక్కువ. ముఖ్యంగా ఇషాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను తెరకెక్కించినట్టు అనిపిస్తుంది. అతనికి ఇదో మంచి పరిచయం. ఇషాన్‌లోని మాస్‌ కోణాన్ని చక్కగా బయటకు తీశారు పూరి. యాక్షన్‌తో పాటు గాఢతతో కూడిన సన్నివేశాల్లో బాగా నటించాడు. సినిమా చూస్తున్న సేపూ కొత్త కుర్రాడన్న భావన ఎక్కడా కలగదు.

హీరోయిన్స్ మన్నారా, ఏంజెలాలు వాళ్ళ వాళ్ళ పాత్రలకు గ్లామర్ తోను కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతోను న్యాయం చేశారు కానీ ఏంజెలా కన్నా మన్నారా పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.. ఇక పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ కుడా ఈ సినిమాకి కొంతప్లస్ అని చెప్పుకోవచ్చు. మొదటి భాగంలో ఇంటర్వెల్ ముందు వరకు లవ్, హీరోయిజం ని బాగా చూపించాడు పూరి. అలీ అండ్‌ గ్యాంగ్‌ అక్కడకక్కడ కాసిన్ని నవ్వులు పంచింది. మిగిలిన వారు వాటి పరిధి మేర నటించారు.

ఇక సైకో పాత్రలో (అనూప్‌సింగ్‌) నటన సినిమాకి హైలైట్. ద్వితీయార్ధంలో సైకో పాత్రే కీలకం. సైకో కి హీరో కి మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక చివరి అరగంట హీరో పాత్రతో పోటా పోటీగా సైకో పాత్ర ఉంటుంది. కాకపోతే పూరి సంభాషణలు తప్పితే కథలో కొత్తదనం లేకపోవటం… ద్వితీయార్ధం చాల స్లోగా రొటీన్ గా ఉండటం ఇ సినిమాకి మైనస్ గా చెప్పుకోవచ్చు.  కథ, కథనాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. మొత్తానికి పూరి గత చిత్రాలతో పోలిస్తే ఇది చాల బెటర్.  ఇక చివరగా ‘కుర్రాడు’ బాగున్నాడు కానీ, కధ పాతదే…!

READ MORE: డోర మూవీ రివ్యూ మరియు రేటింగ్

సాంకేతిక వర్గం పని తీరు…?:

సునీల్‌ కస్యప్‌ సంగీతం, ముఖేష్‌ ఛాయాగ్రహణం, పూరి మార్కు సంభాషణలు బాగున్నాయి. తన్వి ఫిల్మ్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

బలాలు:

  • కామెడీ
  • సంభాషణలు
  • హీరో
  • విలన్ క్యారెక్టరైజేషన్
  • ఛాయాగ్రహణం

బలహీనతలు:

  • రొటీన్ స్టోరీ
  • ద్వితీయార్ధం

రేటింగ్: 2.75/5

 

Related Post

Comments

comments