వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన ప్రత్యేకత చాటుచుకున్నాడు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తనదైన శైలిలో ట్విటర్ లో కామెంట్ చేశాడు. ‘నాకు మొక్కలంటే ప్రేమ..’ అంటూ పవన్ కళ్యాణ్ పేరుతో వచ్చిన ట్విటర్ పోస్టుపై వర్మ స్పందించాడు. పవన్ కళ్యాణ్ దేవుడని నమ్ముతానని, దేవుళ్ల స్థానాన్ని అతడితో భర్తీ చేయాలని వర్మ కామెంట్ పెట్టాడు.

READ MORE: కాటమరాయుడు ట్రైలర్ అదిరిపోయింది

“అతడు దేవుడని నేను ఎల్లప్పుడు నమ్ముతాను. బాలాజీ, యాదగిరిగుట్ట స్వామి, భద్రాచలం రాముడు తదితర దేవుళ్ల స్థానాలను ‘పీకే’తో భర్తీ చేయాలని నిజంగా భావిస్తున్నా” అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ పై పలు సందర్భాల్లో ట్విటర్ లో వర్మ కామెంట్లు పెట్టారు. అయితే వర్మ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్‌ ఓ సందర్భంలో అన్నారు. మరి పవన్ ఇప్పుడు స్పందిస్తారో లేదో చూడాలి.

 READ MORE: “పెళ్లి చూపులు” నిర్మాతకు మరో గొప్ప పురస్కారం

Related Post

Comments

comments