రివాల్వర్ రాజుకమెడియన్ గా సప్తగిరికి మంచి క్రేజ్ వుంది. ఈ మధ్య కాలంలో ఆయన ధరించిన కొన్ని పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దానికి తోడు ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’తో ఆయన హీరో కూడా ఆయిపోయాడు. ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ రావడంతో సప్తగిరి ఫుల్ ఖుషీగా వున్నాడు.

ఒక వైపున మిగతా హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేస్తూనే, మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆయన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ‘రివాల్వర్ రాజు’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సప్తగిరి చెప్పాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తానని అన్నాడు. సప్తగిరి ఈ సినిమా ఎప్పుడు చేస్తాడో తెలియదుగానీ, ఈ టైటిల్ కి మంచి మార్కులు పడిపోతున్నాయి.

Related Post

Comments

comments