పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన రెండో భార్య రేణూ దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతున్నా.. పవన్ కళ్యాణ్ చెప్పే విషయాలకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ నెల 8న మహిళా దినోత్సవం నేపథ్యంలో ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. “ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్” లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి రేణూ దేశాయ్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

ఈ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్ ని పవన్ కల్యాణ్ గురించి అడిగినప్పుడు ఆసక్తికరంగా సమాధానాలు చెపింది. నటుడిగా, భర్తగా, తండ్రిగా, రాజకీయ నాయకుడిగా 10 మార్కులకు పవన్ కల్యాణ్ కు ఎన్ని మార్కులు వేస్తారు? అనే ప్రశ్నకు రేణూ దేశాయ్ స్పందిస్తూ.. భర్తగా పవన్ “యావరేజ్ స్టూడెంట్” అని.. పదికి నాలుగు లేదా ఐదు మార్కులు మాత్రమే ఇస్తానని చెప్పింది.

అయితే.. ఒక తండ్రిగా పదికి వంద మార్కులు వేస్తానని చెప్పింది. అలానే రాజకీయ నాయకుడిగా పదికి పది మార్కులు వేస్తానని చెప్పింది. తన జీవితంలో చేసిన పొరపాటు.. పవన్ ని పెళ్లి చేసుకోవడమే అని చెప్పింది. తనకు ప్రొఫెసర్ జాబ్ అంటే ఇష్టమని.. తనకు కాబోయే భర్త ప్రొఫెసర్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఇంకా.. భవిష్యత్ లో ఏం చేస్తారో తెలియదు గానీ, పవన్ ఆలోచనలు బాగున్నాయని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.

Related Post

Comments

comments