రామ్‌చ‌ర‌ణ్-సమంత కాంబినేషన్‌లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. అయితే ఆ సినిమా షూటింగ్‌ను ఇప్పుడు వాయిదా వేశారట. దీనికి కారణం హీరోయిన్ సమంతకు వడదెబ్బ తగలడమే. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

READ MORE:  బాహుబలి 2 విషయంలో కరణ్ క్రిమినల్ మైండ్…!

‘‘ఏప్రిల్ 1 నుంచి రాజమండ్రి ప‌రిస‌రాల్లో ఇంత వ‌ర‌కు ఎవ‌రూ చిత్రీక‌రించ‌ని నేచుర‌ల్ లోకేష‌న్స్‌లో మొద‌టి షెడ్యూల్‌ను పూర్తి చేశాం. ఆరు గంట‌ల‌కు షూటింగ్ అంటే అంద‌రూ ఐదు గంటల‌కే లోకేష‌న్‌లో ఉండేవారు. రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత స‌హా అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అంద‌రి స‌హ‌కారంతో మొద‌టి షెడ్యూల్‌ను అనుకున్న ప్లాన్ ప్ర‌కారం పూర్తి చేశాం. అనుకున్న విధంగా సినిమా మంచి అవుట్‌పుట్‌తో రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది’’ అని నిర్మాత‌లు తెలిపారు.

మే 9 నుంచి హైద‌రాబాద్‌తో పాటు రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, హైద‌రాబాద్‌లో నాలుగు రోజుల షూటింగ్ పూర్తయిపోయిందని, రాజమండ్రి షెడ్యూల్‌ను పోస్ట్‌పోన్ చేశామని నిర్మాతలు చెప్పారు. రాజ‌మండ్రిలో 45 నుంచి 47 డిగ్రీల అమిత‌మైన ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా, మొద‌టి షెడ్యూల్‌లో స‌మంత‌కు వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌డంతో న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్‌ను దృష్టిలో ఉంచుకుని రాజ‌మండ్రి రెండో షెడ్యూల్‌ను వాయిదా వేశామని నిర్మాతలు పేర్కొన్నారు.

READ MORE: చిరు కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసిన బోయపాటి …!

జూన్ 1 నుంచి రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో ఏక‌ధాటిగా చిత్రీక‌ర‌ణ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని, గోదావ‌రి న‌ది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను షూట్ చేస్తామని, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్ రాజ్‌, ఆది త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని ఆగస్టులో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.

(Visited 133 times, 1 visits today)

Related Post