బాహుబలి-2 సినిమా సక్సెస్ తర్వాత డైరెక్టర్ రాజమౌళి తీయబోయే సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే.. తాజాగా స్పందించిన విజయేంద్ర ప్రసాద్.. రాజమౌళి ఎలాంటి కథను కావాలనుకుంటున్నాడో వెల్లడించారు. తర్వాతి సినిమాకు ఎలాంటి కథ కావాలో రాజమౌళి చెప్పలేదు కానీ… ఎలాంటి కథలు వద్దో మాత్రం చెప్పాడని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు.

READ MORE: రెడ్డిగారు…?

తన తదుపరి చిత్రానికి గ్రాఫిక్స్ అవసరం లేని కథ కావాలని విజయేంద్ర ప్రసాద్‌కు జక్కన్న చెప్పాడట. దానికి అనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నారట విజయేంద్ర ప్రసాద్. ఇక, అంతకుముందే.. తన తదుపరి చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ లేకుండా లేకుండా తీస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాబట్టి, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో రాజమౌళి తదుపరి చిత్రం బాహుబలిలా గ్రాండ్ ఫిల్మ్ కాదని అర్థమవుతోంది

(Visited 834 times, 1 visits today)

Related Post