హీరో శర్వానంద్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం రాధా థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ఈ యేడాది సంక్రాంతికి సందడి చేసిన శర్వా ‘శతమానం భవతి’ సూపర్ హిట్ కొట్టడంతో ‘రాధా’ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన రాధ టీజర్‌లో అల్లరిపోలీస్‌గా ఆకట్టుకున్న శర్వానంద్ ఈ మూవీతో తన జోరును కంటిన్యూ చేసేందుకు రెడీగా ఉన్నాడు.

రొమాంటిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రానికి చంద్రమోహన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని మే 12రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు బోగిపల్లి బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్‌లు తెలిపారు. రాధా లేటెస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

(Visited 69 times, 1 visits today)

Related Post