Radha movie review and rating, Radha movie review, Radha movie rating. Radha movie review and rating

 

“Radha” english Review

విడుదల తేదీ: మే 12, 2017

దర్శకత్వం: చంద్ర మోహన్ 

నటీనటులు: శర్వానంద్,అక్ష, లావణ్య త్రిపాఠి

నిర్మాతలు: భోగవల్లి బాపినీడు

సంగీతం: రాధన్

రన్ రాజా రన్, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్ తదుపరి చిత్రం ‘రాధా’. ఈ చిత్రం లో శర్వానంద్ కి జంటగా లావణ్య త్రిపాఠి మరియు అక్ష నటించారు. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో శర్వా కనిపిస్తాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. మరి ఇలాంటి అంచనాలతో  రాధా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలను మన రాధా అందుకున్నాడో లేదో మన రివ్యూ లో చూద్దాం.

కథ:

చిన్నప్పుడే పోలీస్ అవ్వాలని ననిర్ణయించుకుంటాడు రాధాకృష్ణ(శర్వానంద్). పోలీస్ అవ్వాలనే తపనతో కొంతమంది క్రిమినల్స్ ని పట్టుకుంటాడు, తన తపన చూసి డీజీపీ రాధ కి SI పోస్టింగ్ ఇస్తాడు. పోలీస్ అయి ఒక పల్లెటూరిలో పోస్టింగ్ కు వెళతాడు. అలా డ్యూటీ మీద ఆ ఊరికి వెళ్లిన రాధాకృష్ణ అదే ఊరిలో ఉండే రాధ (లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు. ఇంతలోనే అతనికి హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా హైదరాబాద్ వచ్చిన అతను CM కాండిడేట్ అయిన సుజాత(రవి కిషన్) అనే పొలిటీషియన్ ని టార్గెట్ చేస్తాడు.  అసలు రాధ సుజాతని ఎందుకు టార్గెట్ చేసాడు ? అతన్ని రాధ ఎలా దెబ్బకొట్టాడు ? ఈ మధ్యలో రాధ ప్రేమ కథ ఎలా సాగింది ? అనేదే ఈ సినిమా కథ.

ఎలా ఉందంటే..?

ఇది పక్కా కమర్షియల్ ఫార్ములాని అనుసరించి తీసిన సినిమా, సినిమా స్టార్టింగ్ కాస్త ఎంటర్టైనింగా, శర్వానంద్ క్యారక్టర్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. పోలీసాఫీసర్ అవ్వాలనే తపన ఉన్న కుర్రాడిగా అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. కానిస్టేబుల్ షకలక శంకర్ శర్వానంద్ మధ్య నడిచే కామెడీ ట్రాక్ నవ్విస్తుంది. సినిమా ఫస్టాఫ్ మొత్తం కేవలం కామెడీ, హీరో హరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కోసం మాత్రమే వాడుకున్నారు దీంతో ఇంటర్వెల్ వరకు సినిమా అసలు కథలోకి వెళ్ళదు. హీరో, హీరోయిన్ ను ప్రేమలోకి దింపడమనే సీక్వెన్స్ మరీ ఫన్నీగా, రొటీన్, కొంచెం బోరింగ్ గా అనిపించాయి.

కథలో అసలు ట్విస్ట్ తెలిసిపోయాక ఆపై జరిగే ప్రతి సన్నివేశాన్ని చాలా సులభంగా ఊహించేయవచ్చు. పైగా కథలో కూడా కొత్తదనమంటూ ఏమీలేదు. అలాగే సెకండాఫ్లో హీరో విలన్ల మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడూ హీరోదే పై చేయి అవడంతో కథనంలో దమ్ము తగ్గింది. ఇక మధ్య మధ్యలో వచ్చే పాటలు ఏమంత గొప్పగా ఆకట్టుకోలేకపోయాయి. సెకండాఫ్ సినిమా అంతా హీరో, విలన్ ల మధ్యే నడిచే సీరియస్, కామెడీ సన్నివేశాలు, వాటి మధ్యలో హీరో – హీరోయిన్లతో కూడిన కొన్ని ఫన్నీ రొమాంటిక్ సన్నివేశాలతో కొంచెం ఎంటర్టైనింగ్ సాగినా కథపై ఆసక్తి పెంచలేకపోయాడు దర్శకుడు. సినిమా చివరిలో వచ్చే ఎమోషనల్ సీన్స్ మాత్రం ఆకట్టుకునేలా వున్నాయి. విలన్ (రవి కిషన్) తన బాడీ లాంగ్వేజ్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.

దర్శకుడు చంద్ర మోహన్ కథా బలం లేని ఈ కమర్షియల్ రొటీన్ ఎంటర్టైనర్ తొ average మార్కులు మాత్రమే సంపాదించుకున్నారు. రాధన్ సంగీతం కమర్షియల్ సినిమాల స్థాయికి తగ్గట్టు లేకుండా సాదాసీదాగా ఉంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ పరవాలేదనిపించాయి. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.

మొత్తం మీద ‘రాధ’ రొటీన్ కమర్షియల్ ఎంటరటైనర్లను ఇష్టపడే ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలడు.

బలాలు:

  • శర్వానంద్ నటన
  • విలన్ రవి కిషన్
  • కొన్ని కామెడీ సీన్స్

బలహీనతలు:

  • కథ
  • మ్యూజిక్
  • స్క్రీన్ ప్లే
  • డైరెక్షన్

రేటింగ్:  2.5/5

“Radha” english Review

(Visited 4,354 times, 1 visits today)

Related Post