పవన్‌కళ్యాణ్‌ సరసన ‘గోకులంలో సీత’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రాశి పవర్‌స్టార్‌తో తనకున్న స్మృతులని నెమరు వేసుకుంది. పవన్‌ అప్పట్లో అసలు మాట్లాడేవాడు కాదని, తనకి పాప పుట్టిన తర్వాత ఒకసారి పవన్‌ని కలిసేందుకు అతని ఆఫీస్‌కి వెళ్లానని, అపాయింట్‌మెంట్‌ లేకపోవడంతో తనని లోపలికి పంపించకుండా కూర్చోపెట్టారని, కానీ తను వచ్చిన సంగతి తెలిసి పవన్‌ లోనికి పిలిపించి చాలా ఆప్యాయంగా మాట్లాడాడని, పాప సంగతులు అడిగి తెలుసుకున్నాడని రాశి చెప్పుకొచ్చింది.

READ MORE: లంక మూవీ రివ్యూ మరియు రేటింగ్

అసలు పవన్‌ని కలవడానికి గల కారణమేంటనేది రాశి చెప్పకపోయినా, గోకులంలో సీత షూటింగ్‌ జరిగినన్ని రోజుల్లో మాట్లాడిన దాని కంటే తన ఆఫీస్‌లో కలిసిన ఆ కొద్ది సేపట్లోనే పవన్‌ తనతో ఎక్కువ మాట్లాడాడంటూ నవ్వేసింది. బహుశా దర్శకుడైన తన భర్తకి అవకాశం ఇస్తాడేమో చూద్దామని పవన్‌ని రాశి కలిసి వుండాలి…! అయితే ప్రస్తుతం రాశి తన భర్త దర్శకత్వంలో నటించిన ‘లంక’ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

READ MORE: బ్లాక్ మనీ మూవీ రివ్యూ మరియు రేటింగ్

(Visited 241 times, 1 visits today)

Related Post