సీనియర్ హీరోయిన్ రాశి పెళ్ళి తర్వాత కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. కళ్యాణ వైభోగమే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ చిత్రంలో హీరోయిన్ కి తల్లిగా నటించింది. ఆ మధ్య బుల్లి తెరపై కూడా కాస్త సందడి చేసిందిలేండి. అయితే ప్రస్తుతం రాశి ప్రధాన పాత్రలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతుంది. లంక అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేశారు.

డీజె (దువ్వాడ జగన్నాథమ్) టీజర్

రాశి భర్త శ్రీ ముని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, రోలింగ్ రాక్స్ బ్యానర్ పై ఈ మూవీ రూపొందుతుంది. శ్రీ చరణ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సాయి రోనక్ మరియు ఎనా సహా ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో పాటు మూవీపై మరింత ఆసక్తిని పెంచింది. మరి ఆ టీజర్ పై మీరు ఓ లుక్కేయండి.

LANKA Telugu Movie Teaser

శర్వానంద్ రాధా మూవీ టీజర్

(Visited 132 times, 1 visits today)

Related Post