ప్రేమ ఇష్క్ కాదల్.. సావిత్రి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేని. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలో తీస్తున్న ఈ వెబ్ సిరీస్ పేరు.. ‘పిల్ ఏ’.

ఇప్పుడీ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. జీవితంలో మర్చిపోలేని క్షణాలుంటాయ్ అంటూ రొమాంటిక్ మూమెంట్స్ ను.. కంట్రోల్ చేసుకోలేని క్షణాలు అంటూ పార్టీలో ఎంజాయ్ చేసిన సీన్స్ ను చూపించాడు దర్శకుడు. ఈ వెబ్ సిరీస్ లో హీరోయిన్ పేరు ధన్యనే కావడం విశేషం. అయితే.. అనుకోకుండా హీరోయిన్ పాత్ర గర్భవతి అవుతుంది. ఇందుకు కారణం అయిన వ్యక్తి ఎవరు అని తెలుసుకోవడం చుట్టూ ఈ వెబ్ సిరీస్ తిరుగుతుంది. 

వియు మరియు అన్నపూర్ణ స్టూడియోస్ వారు ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు. ఈ నెల 29 రిలీజ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ని చూడాలనుకునే వారు వియు (www.viu.com) వెబ్ సైట్ లో చూడొచ్చు.

 

PILL A Official Trailer | Annapurna Studios | Dhanya Balakrishna |

Related Post

Comments

comments