స్పెషల్‌ స్టాటస్‌ కోసం పోరాడుతోన్న ఆంధ్రప్రదేశ్‌ యువతని చూస్తే పవన్‌ ఆవేశం కట్టలు తెంచుకున్నట్టుంది. తను కొంత కాలంగా స్పెషల్ స్టేటస్ గురించి ఎన్నో చెబుతోన్న దానికి ఇప్పుడు స్పందన కనిపించడంతో పవన్‌కళ్యాణ్‌ తన జనసేన కార్యకలాపాలని ఉధృతం చేయడానికి ఇదే తగిన సమయమని, ఇదే పర్‌ఫెక్ట్‌ ఆపర్చునిటీ అని ఫీలవుతున్నట్టున్నాడు.

ఒకటీ అరా ట్వీట్లు మినహా ఎప్పుడూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండి ఎరుగని పవన్‌ కళ్యాణ్‌ గత రెండు రోజులుగా ట్వీట్ల పరంపర సాగిస్తున్నాడు. గత రెండేళ్లలో కేవలం నూట యాభై ట్వీట్లు మాత్రమే పోస్ట్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌, గత రెండు రోజుల్లో యాభైకి పైగా ట్వీట్స్‌ చేసాడు . పొలిటికల్‌గా యాక్టివ్‌ అవడానికి తగిన టైమ్‌ కోసం చూసిన పవన్‌కళ్యాణ్‌కి ‘ఏపీ స్పెషల్‌ స్టేటస్‌’ ఇష్యూపై పబ్లిక్‌లో వచ్చిన కదలిక ఊపిస్తోంది.

‘జల్లికట్టు ఉద్యమం’ జరుగుతున్నపుడు ఇలాంటిదే ఏపీలో కూడా జరగాలంటూ ముందుగా పవన్‌కళ్యాణ్‌ సూచించాడు. అతను అనడం ఏమో కానీ ఆ జల్లికట్టు ఉద్యమం నుంచి స్ఫూర్తి పొంది ఇప్పుడు ఏపీ యువత నిశ్శబ్ధ విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఎల్లుండి విశాఖలో జరగబోతున్న ఆ నిరసన కార్యక్రమానికి ముందు పవన్‌ తన ‘దేశ్‌ బచావో’ ఆల్బమ్‌ని విడుదల చేసాడు. తన సినిమాల్లోని మేల్కొలుపు గీతాలని, తన రాజకీయ ఉపన్యాసాలని మిక్స్‌ చేస్తూ చేసిన ఈ ఆల్బమ్‌కి పవన్‌ అభిమానుల నుంచి స్పందన బాగుంది.

అలాగే కొద్ది నిమిషాల ముందు పవన్ చేసిన ట్వీట్స్ మీ కోసం:

 

pawan

pawan

Comments

comments