మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో.. పవన్ ఫ్యాన్స్ హంగామా బాగానే నడిచింది. జనసేన జెండాలు కూడా కనిపించాయి. చిరంజీవి స్వయంగా వారించడం కూడా కనిపించింది. రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం మూవీస్ కి రిలేటెడ్ గా ఫంక్షన్ జరపాలన్న ఆలోచన మెగా క్యాంప్ ది. అందుకే వీలైనంత వరకూ ఇలాంటివాటిపై ఫోకస్ పడకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే.. ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ రాకపోవడం చిరు సహా మెగా హీరోలను నిరుత్సాహపరిచింది. బయటపడకపోయినా.. తమ స్పీచ్ లలో పవన్ కళ్యాణ్ మాట ఎత్తకుండా వదిలేయడంతో.. ఈ విషయం అర్ధమయిపోతుంది. చివరి నిమిషం వరకూ వస్తానన్నట్లుగానే హింట్స్ ఇచ్చి.. చివర్లో పవన్ హ్యాండ్ ఇచ్చినట్లు టాక్. తన స్నేహితుడు శరత్ మరార్ ను పంపి ఊరుకున్నాడంతే. వేడుకలో కూడా పవన్ పేరును శరత్ మరార్ ప్రస్తావించాడంతే. అయితే.. ఇలా పవన్ పేరు ను ఉద్దేశ్యపూర్వకంగా ఎత్తకపోవడం.. పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది.

ఫంక్షన్ అయిపోయాక ఆ ఏరియా చూస్తే.. ఈ సంగతి ఈజీగానే అర్ధమవుతుంది. కుర్చీలతో సహా మొత్తం విరగ్గొట్టేసి.. ఓ యుద్ధ రంగంగా మార్చేశారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ మాత్రమే చేసేశారని అనడం అంత కరెక్ట్ కాకపోయినా.. ఎక్కువ డ్యామేజ్ కి మాత్రం కారణం వాళ్లే అనే టాక్ వినిపిస్తోంది.

Comments

comments