బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా ‘సాహో’. ‘ది కంక్లూజన్’ ఇంటర్వెల్ టైంలో ‘సాహో’ ఫస్ట్ టీజర్ ప్రదర్శించబోతున్న సంగతి తెలిసిందే. అంతకంటే కొన్ని గంటల ముందు యూట్యూబ్ లో ఈ టీజర్ లాంచ్ అవుతుంది. ఐతే ఏదైనా కొత్త సినిమాకు సంబంధించి ఫస్ట్ టీజర్ కంటే ముందు ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం ఆనవాయితీ. అందుకే ఈ ఆదివారం నాడు ఫస్ట్ లుక్ కోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కానీ అనుకోని విధంగా ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని రద్దు చేసేశారన్నది తాజా సమాచారం.

READ MORE: బన్నీసంక్రాంతి టార్గెట్…!

నేరుగా టీజర్ తోనే ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలని ‘సాహో’ టీం నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్లే టీజర్ ను చాలా రిచ్ గా ఉండేలా చూసుకుంటున్నాడట దర్శకుడు సుజీత్. ఇది జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. ప్రమోద్ ‘యువి క్రియేషన్స్’ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

READ MORE: అక్కడ బాహుబలి చిత్రం పై ముదురుతున్న వివాదం…!

(Visited 61 times, 1 visits today)

Related Post