ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో నిఖిల్ తన తర్వాతి ప్రాజెక్టులు కూడా అదే తరహాలో విభిన్నంగా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం సుధీర్ వర్మ డైరెక్షన్లో ‘కేశవ’ సినిమాను చేస్తున్న నిఖిల్ ఇంకొద్ది రోజుల్లో ఆ చిత్రాన్ని ముగించేసి కొత్త ప్రాజెక్ట్ ను మొదలుపెట్టనున్నారు.

READ MORE: కొత్త పార్టీ పై స్పందించిన యంగ్ టైగర్…!

ఈ చిత్రం 2016 లో కన్నడలో అత్యంత తక్కువ బడ్జెట్ తో రూపొంది సుమారు రూ. 58 కోట్లకు పైగానే వసూళ్లు సాధించిన ‘కిరిక్ పార్టీ’ కి తెలుగు రీమేక్ గా ఉండనుంది. ఇంజనీరింగ్ చదువుకునే కుర్రాళ్ళ జీవితాల్లోకి రాజకీయాలు ప్రవేశించి వాళ్ళ జీవితాల్ని ఎలాంటి మలుపులు తిప్పాయి అనేదే ఈ చిత్ర కథాంశం. జూన్ లో మొదలుకానున్న ఈ సినిమాని ప్రముఖ నిర్మాత ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర నిర్మించనున్నారు.

READ MORE: కొత్తగా ఆలోచిస్తున్న పవన్…!

Related Post

Comments

comments