విడుదల తేదీ: ఫిబ్రవరి 3, 2017

  • దర్శకత్వం: త్రినాథ రావు నక్కిన
  • నటి నటులు: నాని, కీర్తి సురేష్
  • నిర్మాత: దిల్ రాజు
  • మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్

గతేడాది మూడు వరుస విజయాల తర్వాత యంగ్ హీరో నాని  నటించిన  ‘నేను లోకల్’ ఈరోజు ప్రేక్షకుల ముంధుకు వచ్చింది. దర్శకుడు త్రినాథ రావ్ నక్కిన డైరెక్షన్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుండి మంచి అంచనాలున్నాయి. పైగా లక్కీ హ్యాండ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో ఈ హైప్ మరింత పెరిగింది. మరి ఇన్ని అంచనాల మధ్య ఈ రోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కధలోకి వెళ్తే: యాటిట్యూడే సర్వసంగా లైఫ్ ను హ్యాపీగా గడిపే కుర్రాడు బాబు (నాని) అతి కష్టం మీద బీటెక్ పాసై తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్న సమయంలో కీర్తి (కీర్తి సురేష్) ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా తనను ప్రేమించేలా చేస్తాడు. కానీ ఆమె నాన్న మాత్రం వీళ్ళ ప్రేమకు ఒప్పుకోడు.

అదే సమయంలో బాబు ప్రేమకు మరో అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఆ అనుకోని అవాంతరం ఏమిటి ? బాబు దాన్ని ఎలా ఫేస్ చేశాడు ? చివరికి బాబు కీర్తి నాన్నను ఒప్పించాడా లేదా ?  అసలు నేను లోకల్ అనే పేరుకి న్యాయం జరిగిందా అనేదే మీరు తెరపై చూడాల్సిందే….

ఎలా ఉందంటే..?: సినిమాలో ముందుగా చెప్పుకోవలసింది నాని క్యారెక్టరైజేషన్ గురించి ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే కుర్రాడి పాత్ర, ఆ పాత్రలో నాని ఒదిగిపోయాడు. నాని కనిపించిన ప్రతి సీన్ పంచ్ డైలాగులతో నిండి ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఫస్టాఫ్ సినిమా మొత్తం నాని పాత్ర చుట్టూ తిరుగుతూ, సరదా సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టకుండా సాఫీగా సాగిపోయింది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బలంగా ఉండి సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచింది.

ఇక సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సన్నివేశం, నిశ్చితార్థం సీన్ చాలా బాగా నవ్వించాయి. కీర్తి సురేష్ నటన సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఎమోషన్ సన్నివేశం కాస్త పర్వాలేదనిపించింది.  దేవి శ్రీ పాటలు ఈ చిత్రానికి మరో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.  త్రినాథరావు నక్కిన టేకింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరి అందంగా తయారయ్యాయి. కీలకమైన నవీన్ చంద్ర పాత్ర, నాని తండ్రి స్థానంలో పోసాని కృష్ణ మురళి నటన, హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడేకర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ సీన్స్ అన్ని బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ అనవసరం అనిపించేలా ఉంటాయి.

ఓవరాల్ గా నాని మరోసారి ప్రేక్షకులని ఆకట్టుకోవడం లో సఫలమయ్యాడని చెప్పుకోవచ్చు.

సాంకేతిక వర్గం పని తీరు…?: దర్శకుడు త్రినాథరావు నక్కిన తాను తీసుకున్న కథ పాతదే అయినా దానికి కొత్తగా ఉండే హీరో క్యారెక్టరైజేషన్, నాని, కీర్తి సురేష్ నటనను జోడించి తన టాలెంట్ చూపాడు. దేవిశ్రీ అందించిన పాటలు ఎంటర్టైనింగా ఉంటూ సినిమాకి అదనపు బలాన్నిచ్ఛాయి. నాని పాత్రకు ప్రసన్న కుమార్ రాసిన పంచ్ డైలాగులు చాలా బాగా ఆకట్టుకున్నాయి. నిర్మాత దిల్ రాజు మరోసారి తన గొప్ప నిర్మాణ విలువలను చాటుకున్నాడు.

బలాలు:

  • నాని, కీర్తి సురేష్
  • కామెడీ
  • పాటలు
  • క్లైమాక్స్ డైలాగ్స్

బలహీనతలు:

  • రొటీన్ స్టోరీ
  • కొన్ని కొన్ని సన్నివేశాలు

రేటింగ్: 3.25/5

 

(Visited 307 times, 1 visits today)

Related Post