ఆలస్యంగా ప్రకటించిన నంది అవార్డులు ఎప్పటిలానే అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి. ముఖ్యంగా చాలా అవార్డులు పారదర్శకతపై ప్రశ్నార్ధకత నెలకొంది. ముఖ్యంగా 2013కి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌ని ఎంపిక చేయడం చర్చనీయా అంశం అయింది. 2013కి గాను ప్రభాస్‌(మిర్చి), మహేష్‌ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), పవన్‌కళ్యాణ్‌ (అత్తారింటికి దారేది) ఫ్రంట్‌ రన్నర్స్‌ అని వార్తలొస్తూనే వున్నాయి.

అయితే ప్రభాస్‌ తరఫున లాబీయింగ్‌ బాగా జరిగిందని గుసగుసలు వినిపించాయి ఎందుకంటే బాహుబలి 2 రిలీజ్‌కి ముందు ఇది కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అవుతుందని ‘బాహుబలి’ బృందం కూడా తలా ఒక మాట వేశారట. ఎలాగో అమరావతి పబ్లిసిటీ కోసం రాజమౌళి సాయం కోరిన చంద్రబాబుకి అతని మాట మీద గురి బాగానే వుంటుంది. ఇక పవన్‌కళ్యాణ్‌ కి ఈ లాబీయింగ్ అనే మాటే నచ్చదు.

ఎప్పుడూ అవార్డులను ఆశించి ఎరుగని పవన్‌ కోసం ‘అత్తారింటికి దారేది’ బృందం కుడా అవార్డు ఇవ్వాలంటూ ఎటువంటి రిక్వెస్ట్‌ పెట్టుకోలేదు. అత్తారింటికి దారేదిలో పవన్‌ కళ్యాణ్‌ ఎదో గొప్పగా నటించేశాడని కాదు కానీ, మిర్చితో పోల్చుకుంటే అత్తారింటికి దారేది సినిమాలో హీరోకే నటనకి బాగ స్కోప్ ఉంటుంది. ఎలాగైతేనే పవన్ కి అవార్డ్ రాలేదని తెలిసి ఆయన అభిమానులు మాత్రం ఉసూరుమన్నారు.

(Visited 843 times, 1 visits today)

Related Post