‘గోవిందుడు అందరివాడే’ సినిమా అంతగా ఆడకపోయినా.. కృష్ణవంశీ గత సినిమాలైన మొగుడు, పైసా ల్లాగా డిజాస్టర్ అయితే కాలేదు. దీంతో ఆయన కొంచెం కోలుకుని మంచి కథ ని రూపొందించి సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ అనే క్రేజీ ప్రాజెక్టును లైన్లో పెట్టాడు. ఆరంభం నుంచి ఈ సినిమా ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. ఒక టైంలో ఒక్క సాంగ్ కి కోట్లలో ఖర్చు అయిందని ఆ సాంగ్ సినిమాకే హైలైట్ అని హైప్ క్రెయేట్ చేశారు.

వరుసగా ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ.. ప్రమోషన్ విభిన్నంగా చేస్తూ సినిమాను బాగానే వార్తల్లో నిలిపాడు కృష్ణవంశీ. కానీ మూడు నెలల నుంచి ఈ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేదు. నెమ్మదిగా ఈ చిత్రం వార్తల నుంచి పక్కకు వెళ్లిపోయింది. గత ఏడాది చివర్లోనే వస్తుందనుకున్న సినిమా.. ఇప్పుడిప్పుడే విడుదలయ్యేలాగా కనిపించట్లేదు. ఆర్థిక ఇబ్బందుల వలనే ఈ సినిమా ఆలస్యం అవుతుందని టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం.

‘నక్షత్రం’ నిర్మాతలు విజయ్ ఆంటోనీ మూవీ ‘బేతాళుడు’ మీద పెట్టుబడి పెట్టారు. కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ ప్రభావం ‘నక్షత్రం’ మీద పడింది. దింతో ఫైనాన్స్ ఇబ్బంది తో ఈ సినిమా షూటింగ్ పెండింగ్ లో పడిపోయిందట. మరోవైపు ఈ సినిమా ప్రోమోషన్స్ లేకపోవడం వల్ల క్రేజ్ తగ్గిపోతోంది. సందీప్ కిషన్ ఫాంలో లేకపోవడంతో కూడా సినిమాకు ప్రతికూలంగా మారుతోంది. సినిమా మీద హైప్ ఉన్న టైంలోనే చకచకా విడుదలకు సిద్ధం చేస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఇది కూడా ‘పైసా’ లాగా అయిపోతుందేమో అని కృష్ణవంశీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది… వీలైనంత త్వరగా ‘నక్షత్రం’ బయటికి రాకపోతే కృష్ణవంశీ కెరీర్ డేంజర్ లో పడటం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

Comments

comments