ఒక హీరో వరుసగా రెండు మూడు హిట్లు కొడితేనే ఆశ్చర్యపోతాం. కానీ టాలీవుడ్లో కొందరు హీరోలు 4.. 5.. 6 హిట్లతో దూసుకెళ్లిపోతుండటం విశేషం. నేచురల్ స్టార్ నాని ఆల్రెడీ ‘నేను లోకల్’తో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ‘ఎవడే సుబ్రమణ్యం’తో మొదలుపెట్టి వరుసగా ఆరో హిట్ అందుకున్నాడు. మరో టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ మధ్యే వరుసగా నాలుగో హిట్లు ఖాతాలో వేసుకున్నాడు. అతను రన్ రాజా రన్.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో హ్యాట్రిక్ పూర్తి చేసి.. ఇటీవలే ‘శతమానం భవతి’తో నాలుగో విజయాన్ని.. కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.

ఈ యంగ్ హీరోలను అనుసరిస్తూ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం విన్నింగ్ స్ట్రీక్ కొనసాగిస్తున్నాడు. ఆయన మనం.. సోగ్గాడే చిన్నినాయనా.. ఊపిరి సినిమాలతో హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు ‘ఓం నమో వెంకటేశాయ’తో డబుల్ హ్యాట్రిక్ మీద కన్నేశాడు. ఆయనకిది వరుసగా నాలుగో హిట్టు. ఈ వయసులో నాగార్జున ఇలా దూసుకెళ్లిపోతుండటం ఆశ్చర్యమే. ఈ నాలుగు హిట్లలో వేటికవే భిన్నమైనవి. ‘ఊపిరి’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో.. ‘ఓం నమో వెంకటేశాయ’ లాంటి ఆధ్యాత్మిక చిత్రంతోనూ ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారు. ఈ నాలుగు సినిమాల్లోనూ నాగ్ నటన ఆకట్టుకుంది.

(Visited 244 times, 1 visits today)

Related Post