టాలీవుడ్ యంగ్ హీరోల్లో తక్కువ సమయం లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నాగశౌర్య గతేడాది కళ్యాణ వైభోగమే, జ్యోఅచ్యుతానంద సినిమాలతో రెండు హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దాంతో ఈ హీరో తదుపరి సినిమాNag sourya ఏమి చేస్తున్నాడా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ ఇప్పటివరకు ఒక్క సినిమాని కూడా ప్రకటించలేదు. కారణం ఓ నిర్మాత విషయంలో నాగశౌర్య ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే నాగశౌర్య సినిమా చేస్తానని చెప్పి సదరు నిర్మాత దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకొని ఆ సినిమాని ఇంతవరకు ఫైనల్ చేయలేదట. అంతేకాదు సొంతగా ఓ నిర్మాణ సంస్థ పెట్టె ఆలోచనలో ఉన్నాడట నాగశౌర్య. తన బ్యానర్ లో సినిమా చేసిన తర్వాతనే నీ విషయం చూస్తా అని ఆ నిర్మాతతో అన్నాడట. దాంతో ఆ నిర్మాత తన గోడును పరిశ్రమ పెద్దల వద్ద చెప్పుకోవడంతో ఈ విషయం ఆ నోటా ఇ నోటా పడి ఇప్పుడు ఫిలిం నగర్ లో అది  పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దాంతో నిర్మాతలు నాగశౌర్య తో సినిమా చేయాలంటే భయపడుతున్నారట. అందుకే శౌర్యకి ఏ అవకాశం రావడం లేదు.

కుర్ర హీరోలు రెండు..మూడు సినిమా లు హిట్ అయ్యే సరికి నిర్మాతలను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని అందరి భావన, గతంలో కూడా ఒక పెద్ద నిర్మాత రాజ్ తరుణ్ కి అడ్వాన్స్ ఇవ్వడం నేను చేసిన పెద్ద తప్పు అని మీడియా ఇంటర్వ్యూ లో చెప్పడం పెద్ద హాట్ టాపిక్ అయింది… మళ్ళీ ఇప్పుడు నాగశౌర్య… ఈ దెబ్బతో కుర్ర హీరోలకి అడ్వాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు భయపడాల్సివస్తుంది…..కాస్త ఇప్పటికైనా కుర్ర హీరోలు నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉంటే బాగుంటుంది.

(Visited 84 times, 1 visits today)

Related Post