Mister review

Mister review and rating.  Mister rating. Varun Tej Mister Movie Review. Mister Telugu. movie review

Mister Review in English

విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2017

దర్శకత్వం: శ్రీను వైట్ల  

నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్ 

నిర్మాత: నల్లమలపు బుజ్జి 

సంగీతం: మిక్కీ జె. మేయర్ 

ముకుంద, కంచె వంటి చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ తొలిసారిగా ‘మిస్టర్’ లాంటి కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వరుస ఫ్లాపులతో బాధపడుతున్న శ్రీనువైట్ల, ఈ సారి కసితో ఈ సినిమాని తెరకెక్కించాడు. ఈ మూవీపై మంచి ధీమాగా ఉన్నాడు శ్రీను వైట్ల.మరి ఈ సినిమా అయినా శ్రీను వైట్ల కెరీర్ ని గాడిలో పెట్టగలదో లేదో మన రివ్యూలో చూద్దాం.

కథ:

“చై(Varun Tej)” స్పెయిన్ లో వుండే తెలుగు యువకుడు. ఫామిలీ కోసం, తన అనుకున్న వాళ్ళకోసం ఏమైనా చేసే తెగువ వున్న అచ్చ తెలుగు హీరో. ఇండియా లో వుండే తాతయ్య పిచ్చయ్య నాయుడు(నాజర్) అంటే చై కి అసహ్యం. ఒకరోజు ఎయిర్ పోర్ట్ లో పొరపాటుగా “మీరా(హెబ్బా పటేల్)” ని పికప్ చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. చై, మీరా ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ కధలోని ఒక ట్విస్ట్ తో చై ఇండియా రావాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా “చంద్రముఖి (లావణ్య త్రిపాఠి)” ని కలుస్తాడు. అక్కడ నుండి అతనికి కష్టాలు మొదలవుతాయి. ఇంతకీ తాతయ్య అంటే చై కి ఎందుకు అసహ్యం ? చై ఇండియాకి ఎందుకు రావాల్సి వస్తుంది ? అసలు చంద్రముఖి ఎవరు ? చివరికి చై ఎవరిని పెళ్లి చేసుకుంటాడు ?? ఇవన్నీ తెలియాలంటే మాత్రం తెరపై చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..?:

ప్రతి శ్రీను వైట్ల సినిమాలో మనకి కామన్ కనిపించే అంశాలు మూడు 1. కడుపుబ్బా నవ్వించే కామెడీ 2. భారీ తారాగణం 3. అంతుపట్టని ట్విస్టులు. ఈ సినిమా లోకూడా శ్రీను వైట్ల తన శైలికి తగ్గట్లే ఆ మూడు అంశాలను వదలకుండా ఒక మెసేజ్ తో కూడిన triangle love story ని తెరకెక్కించారు. ఎప్పట్లానే శ్రీను వైట్ల హీరో క్యారక్టర్ తో ఒక పక్క కామెడీ చేయిస్తునే మరో పక్క అదిరిపోయే ఫైట్ సీన్స్ తో హీరోయిజం బాగా ఎలివేట్ అయ్యేలా చేశారు. వరుణ్ తేజ్ మరోసారి తన పెర్ఫార్మన్స్ తో శభాష్ అనిపించుకున్నాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ సీన్స్ లో వరుణ్ తేజ్ చాల ఈజ్ తో అలవోకగా నటించాడు.

సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కడుపుబ్బా నవ్వించే కామెడీ, సెంటిమెంట్, ఇంటర్వెల్ దగ్గర యాక్షన్ సీన్స్ తో చాలా బాగా నడిపించాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎక్కడా బోర్ కొట్టకుండా అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అనిపించేలా చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. మంచి యాక్షన్ సీక్వెన్స్ తో ఇంటర్వెల్ ఇచ్చారు. సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్, యాక్షన్ మోతాదు కొంచెం పెరుగుతుంది. అక్కడక్కడా కామెడీ టచ్ ఇస్తూ సెకండ్ హాఫ్ నడిపించాడు దర్శకుడు శ్రీను వైట్ల.

ఎప్పట్లానే మొదట్లో భయంకరంగా చూపించిన విలన్ ని క్లైమాక్స్ లో సింపుల్ గా తేల్చేశాడు దర్శకుడు. వరుణ్, హెబ్బా పటేల్, లావణ్య త్రిపాఠి మధ్య నడిచే triangle love story లో ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడం కొంచెం రొటీన్ గా అనిపించింది, దీంతో సెకండ్ హాఫ్ లో కొన్ని కొన్ని సీన్స్ విసుగ్గా అనిపిస్తాయి. మిక్కీ జె. మేయర్ సాంగ్స్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ పరవాలేదనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫారిన్ సీక్వెన్స్ లోని లొకేషన్స్, సెకండ్ హాఫ్ లోని ఇండియన్ లొకేషన్స్ చాలా అందంగా వున్నాయి. సినిమాటోగ్రాఫర్ కే.వి. గుహన్ ఏ లొకేషన్స్ ని చాల బాగా కాప్చర్ చేసారు.

ఓవరాల్ గా “మిస్టర్” ఈ సమ్మర్ లో ఫామిలీ తో కలిసి చూడదగ్గ ఒక మంచి ఎంటర్టైనర్

బలాలు:

  • డైరెక్షన్
  • స్క్రీన్ ప్లే
  • వరుణ్ తేజ్
  • కామెడీ
  • యాక్షన్ సీన్స్

బలహీనతలు:

  • సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్
  • Average గా వున్నా బాక్గ్రౌండ్ మ్యూజిక్

రేటింగ్: 3/5

 

Mister Review in English

(Visited 2,689 times, 1 visits today)

Related Post