గత ఏడాది ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ లాంటి సక్సెస్ ఫుల్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పంజాబీ భామ మెహ్రీన్. రెగ్యులర్ హీరోయిన్ల ఫీచర్లు లేకపోయినా తన టిపికల్ అందంతో.. అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది మెహ్రీన్.

ఈ సినిమా విడుదలైన కొన్ని రోజులకు ఆమెపై అవకాశాల వర్షం కురుస్తున్నట్లుగా వార్తలొచ్చాయి. అల్లు అర్జున్ కొత్త సినిమాతో పాటుగా ఇంకొన్ని ప్రాజెక్టుల్లో ఆమె పేరు వినిపించింది. కానీ ఆ తర్వాత చూస్తే ఆ వార్తలేమీ నిజం కాలేదు. దాదాపు ఏడాదిగా ఆ అమ్మడు ఖాళీగానే ఉండిపోయింది. కానీ అవకాశాలు అందుకోవడంలో కొంచెం ఆలస్యమైనా.. ఇప్పుడామెకు బంపర్ ఆఫర్లే తగులుతున్నాయి.

ఆల్రెడీ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ చేయబోయే కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’లో ఒక కథానాయికగా ఎంపికైంది మెహ్రీన్. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చిన కొన్ని రోజులకే ఆమె హీరోయిన్‌గా ఇంకో సినిమా మొదలైంది. అదే.. జవాన్. సాయిధరమ్ తేజ్ హీరోగా బి.వి.ఎస్.రవి తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ఇది. దీంతో పాటు ఇంకో రెండు మూడు సినిమాలకు కూడా కథానాయికగా ఆమె పేరు పరిశీలనలో ఉందట.

ఈ ఏడాది ఆమె మొత్తం అరడజను సినిమాల్ని లైన్లో పెట్టే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవైపు హిందీలో అనుష్క శర్మ నటిస్తూ నిర్మిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఫిలౌరి’లోనూ ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇలా మెహ్రీన్ ఒక్కసారిగా చేతి నిండా అవకాశాలతో బిజీ అయిపోతోంది. వీటిలో కొన్ని సినిమాలు కనుక హిట్ అయితే ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే….

(Visited 70 times, 1 visits today)

Related Post