మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు బుల్లితెర అరంగేట్రం చేసేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న మెగాస్టార్ హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు తొలి ఎపిసోడ్ ప్రసారం అయింది. కోట్లాదిమంది మెచ్చే వెండితెర మెగాస్టార్.. బుల్లితెరపై తను ఆడుతూ.. కంటెస్టెంట్లతో ఆడిస్తుంటే.. చూసేందుకు జనాలకు రెండు కళ్లు చాలలేదు. ఈ షో గురించిన ఇంట్రడక్షన్ తో పాటు.. మరికొన్ని ఇంట్రెస్టింగ్ సంగతులను కూడా షేర్ చేసుకున్నారు మెగాస్టార్.

వీటిలో తాజాగా బయటకు వచ్చిన ఒక ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది. చిరంజీవి.. రాధిక.. సుహాసినిలు కలిసి ఒకే ఫోటో దర్శనం ఇచ్చిన ఈ పోజ్ అందరినీ అబ్బురపరుస్తోంది. ఒకవైపు రాధిక.. మరోవైపు సుహాసిని.. ఇద్దరూ మెగాస్టార్ కు చెరోవైపు కూర్చుని.. చెరో చెయ్యి పట్టుకుని ఇచ్చిన పోజ్ అదిరిపోయింది. అందరి మొహాల్లోనూ కనిపిస్తున్న చిరునవ్వు ఈ ఫోటోకు అసలు సిసలైన హైలైట్. తన మాజీ హీరోయిన్లతో మెగాస్టార్ ఇచ్చిన పోజ్ సూపర్బ్.

మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోలో భాగంగా మహిళా దినోత్సవం(మార్చ్ 8) రోజున.. ఈ ఇద్దరు సీనియర్ బ్యూటీలతో ఆడించనున్నారు చిరు. ఆ ఎపిసోడ్ చిత్రీకరణ సందర్భంగా తీసిన ఈ ఫోటో.. చూడముచ్చటగా ఉంది కదూ!

(Visited 150 times, 1 visits today)

Related Post