ఒక వైపున కథానాయకుడిగా వైవిధ్య భరితమైన సినిమాలు చేస్తూనే, మరో వైపున విలన్ గా తన సత్తా చూపడానికి ఆది పినిశెట్టి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన కథానాయకుడిగా ‘మరకతమణి’ అనే సినిమా రూపొందుతోంది. ఎ. ఆర్. కె. శరవణన్ దర్శకుడిగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, నిక్కీ గల్రాని కథానాయికగా నటిస్తోంది.

అడ్వెంచర్ ఘోస్ట్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. రిషీ మీడియా – శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు .. బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. తెలుగు .. తమిళ భాషల్లో ఈ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

 

(Visited 75 times, 1 visits today)

Related Post