దర్శకుడు మణిరత్నంపై లైట్‌మెన్‌ మణిరమణ్‌ చేసిన ఆరోపణలు సరిగా లేవని లైట్‌మెన్‌ సంఘం సెక్రెటరీ రహమాన్‌ అన్నారు. 2007లో మణిరత్నం ‘గురు’ సినిమా తీశారు. ఈ సినిమా సెట్‌లో లైట్‌మెన్‌ మణిరమణ్‌కు ప్రమాదం జరిగింది. అయితే మణిరత్నం తన వైద్య సేవలకు అయ్యే ఖర్చు చెల్లించకపోతే నిరాహార దీక్ష చేస్తామని మణిమరణ్‌ తాజాగా బెదిరించారు.

READ MORE: తమిళనాడులో విడుదలకు లైన్ క్లియర్…!

ఈ సందర్భంగా లైట్‌మెన్‌ సంఘం సెక్రెటరీ రహమాన్‌ మాట్లాడుతూ ‘మాపైన, మణిరత్నంపైన ఆయన(మణిరమణ్‌) చేసే ఆరోపణలు సరిగా లేవు. స్థానిక న్యాయస్థానంలో ఆయన మాపై దావా వేశారు. రూ. లక్ష ఆయనకు చెల్లించమని సంఘం ఆదేశించింది. అప్పుడే ఆ మొత్తం ఇచ్చేశాం. గతంలోనే ఈ సమస్య స్నేహపూర్వకంగా పరిష్కారమైంది. మా వద్ద ఆయన నుంచి తీసుకున్న రసీదు కూడా ఉంది. ఈ విషయాన్ని పెద్దది చేసి అందరి జాలి పొందాలని ఆయన భావిస్తున్నారు. ఎప్పుడో ముగిసిన సమస్యను ఇప్పుడు మళ్లీ ఎందుకు కొత్తగా లేవదీశారో అర్థం కావడం లేదు’ అని రహమాన్‌ పేర్కొన్నారు.

READ MORE: ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ అదుర్స్…!

Related Post

Comments

comments