“లంక” రివ్యూ మరియు రేటింగ్

To read in English click here

lanka review , lanka telugu movie review , raasi lanka review ,  lanka movie review , lanka rating , lanka telugu movie rating

విడుదల తేదీ: ఏప్రిల్ 21, 2017

దర్శకత్వం: శ్రీ ముని 

నటీనటులు: రాశి, సాయి రోనాక్, సుప్రీత్ 

నిర్మాత: నమన దినేష్

సంగీతం: శ్రీ చరణ్ పాకాల 

కథానాయిక రాశి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `లంక`. రోలింగ్‌రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నామన దినేష్, నామన విష్ణు కుమార్ నిర్మించగా, శ్రీముని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందొ మన రివ్యూ లో చూద్దాం..

కథ:

 “స్వాతి” మలయాళం లో స్టార్ హీరోయిన్, కొన్ని కారణాల వల్ల “సాయి” అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తో షార్ట్ ఫిల్మ్ లో నటించడానికి ఒప్పుకుంటుంది. సిటీ కి దూరంగా వున్న ఒక ఇంట్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇంట్లో “రెబెక్కా విల్లియమ్స్” అనే మహిళ నివసిస్తూంటుంది, ఆమెకి “Telepathy” విద్య తెలుసు. “మోనోఫోబియా” తో బాధపడుతున్న స్వాతికి Telepathy ద్వార భయాన్ని పోగొడుతుంది. తర్వాత అమెరికా వెళ్లాలనుకున్న స్వాతి కనిపించకుండా పోతుంది, ఆలా కనిపించకుండా పోయిన స్వాతి ఏమైంది ? ఇంతకీ రెబెక్కా విల్లియమ్స్ ఎవరు ?? స్వాతి కనిపించకుండా పోవడం వల్ల సాయి ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు ? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.    

ఎలా ఉందంటే..?:

“Telepathy” నేపధ్యం లో వచ్చిన ఈ హార్రర్ థ్రిల్లర్ లో చెప్పుకోవాల్సిన విషయాలు రెండు 1. రాశి క్యారక్టర్ 2. Telepathy నేపధ్యం. సినిమా ఫస్టాఫ్ ని కామెడీ తో స్టార్ట్ చేసిన డైరెక్టర్ నవ్వించడానికి చాలా కష్టపడ్డాడు, కొన్ని కొన్ని చోట్ల నవ్వించగలిగాడు కానీ చాలా చోట్ల outdated కామెడీ సీన్స్ తో విసుగు తెప్పించాడు. రాశి క్యారక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుండి సినిమా పై కొంచెం ఆసక్తి పెరుగుతుంది, సినిమా ఊపందుకుంది అనుకునేలోపే సంబంధం లేని సీన్స్ తో successfull గా ట్రాక్ తప్పించేస్తాడు డైరెక్టర్. సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపిస్తుంది, ఉదాహరణకి Telepathy గురించి వివరించే సన్నివేశం, ఇంటర్వెల్ సస్పెన్స్, రెబెక్కా – శరత్ ల ప్రేమ గురించి వివరించే సన్నివేశం, కొన్ని కామెడీ సీన్స్.

సినిమా లో అసలు మైనస్ సెకండ్ఆఫ్, అర్ధం పర్ధం లేని ట్విస్టులతో, లాజిక్ లేని సన్నివేశాలతో సింపుల్ గా తీస్తే బాగుండేది అనిపించే సన్నివేశాలను చాలా కంప్లికేటెడ్ గా చిత్రీకరించాడు దర్శకుడు. రాశిని పోలీసులు ఇంట్రాగేషన్ చేసే సీన్స్ అతిగా అనిపించాయి. దీనికి తోడు సాంగ్స్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ తలనొప్పి తెప్పించాయి. ఓవరాల్ గా రాశి తన comeback మూవీ గా మంచి నేపధ్యం వున్న సినిమాని ఎంచుకున్నా, దర్శకుడు దాన్ని తెరపై చూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు, బాడ్ లక్ రాశి.

బలాలు:

  • Telepathy నేపధ్యం
  • అక్కడక్కడా నవ్వించిన కామెడీ సీన్స్
  • రాశి క్యారక్టర్

బలహీనతలు:

  • డైరెక్షన్
  • డైలాగ్స్
  • స్క్రీన్ ప్లే
  • మ్యూజిక్
  • ఎడిటింగ్

రేటింగ్: 2/5

To read in English click here

(Visited 918 times, 1 visits today)

Related Post