“కృష్ణపక్షం” అనే టైటిల్ తో ఓ అమ్మాయి లంగా, వోణీ కట్టుకుని, బ్యాక్ యాంగిల్ లో తీసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఎలాంటి సమాచారం లేకుండా ‘షూట్ స్టార్టేడ్’ అని రాస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ వీక్షకులను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే ఇదేదో భారీ సినిమానో, లేక మరో రకం సినిమానో కాదు, ఓ ‘షార్ట్ ఫిల్మ్’ షూటింగ్ ప్రారంభమైన నేపధ్యంలో జరుగుతున్న పబ్లిసిటీ. ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల తెరకెక్కిస్తోన్న ఈ షార్ట్ ఫిల్మ్ తో, ఆమె ఉన్నత స్థానాలకు వెళ్తుందని… సోషల్ మీడియా వేదికగా శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

READ MORE: కొత్త కథతో వస్తున్న నిఖిల్ ..!

Related Post

Comments

comments