మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా 10 ఏళ్ళ తర్వాత ‘ఖైదీ నెం 150’ చిత్రంతో రి ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం మొదటి రోజు నుండే భారీ హిట్ టాక్ తెచ్చుకుని రికార్డ్ కలెక్షన్లను వసూలు చేస్తూ నాన్- బాహుబలి రికార్డుల్ని క్రియేట్ చేసింది. కొన్ని ఏరియాల్లో అయితే బాహుబలి రికార్డుల్ని దాదాపు టచ్ చేసింది కూడా. ప్రపంచవ్యాప్తంగా రూ.105 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం నిన్నటితో శతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది.

READ MORE: సంచలన నిర్ణయం తీసుకున్న నటుడు విశాల్…!

ఈ మధ్య కాలంలో దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. దీంతో మెగా అభిమానులు పలు చోట్ల భారీ వేడుకలు నిర్వహించారు. చిత్ర నిర్మాత రామ్ చరణ్ అయితే ‘మీ మెగాస్టార్ తో 100 రోజుల జర్నీ చేయడం ఆనందంగా ఉంది. ఈ పాజిటివ్ ఎనర్జీతోనే నాన్నతో మరో ప్రాజెక్ట్ చేయడానికి సిద్దమవుతున్నాను’ అన్నారు.

READ MORE: దర్శకుడు మణిరత్నంపై ఆరోపణలు…!

Related Post

Comments

comments