Keshava Review and Rating

Keshava telugu movie review and rating, keshava review and rating, Nikhil keshava review, Nikhil keshava rating

Keshava Review in English

విడుదల తేదీ: మే 19, 2017

దర్శకత్వం: సుధీర్ వర్మ

నటీ నటులు: నిఖిల్‌, రీతూ వర్మ, ఇషా కొప్పికర్

నిర్మాత: అభిషేక్ నామ

సంగీతం: సన్నీఎమ్.ఆర్

వరుస విజయాలతో దూసుకు పోతున్న నిఖిల్‌ తాజా చిత్రం ‘కేశవ’ ఇ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిఖిల్‌కు ‘స్వామిరారా’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను ఇచ్చి మళ్లీ ఇన్నాళ్లకు నిఖిల్‌తో దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలనే పెంచాయి. మరి ఏ మేరకు ‘కేశవ’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో మన రివ్యూ లో చూద్దాం.

కథ:

కాకినాడ Law కాలేజీ లో చదువుతున్న కేశవ శర్మ (నిఖిల్) అనే స్టూడెంట్ తన తల్లి తండ్రుల చావుకి కారణమైన వారిని వరుసగా హత్య చేస్తుంటాడు. హత్య కాబడిన వారు పోలీస్ ఆఫీసర్లు కావడంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని పట్టుకోవాలని నిర్ణయించుకుని స్పెషల్ ఆఫీసర్ షర్మిల (ఇషా కొప్పికర్) కు కేసును అప్పగిస్తుంది. షర్మిల ఈ కేసును ఎలా డీల్ చేసింది ?? కేశవను పట్టుకోగలిగిందా ? కేశవ ఎవరెవర్ని, ఎలా చంపాడు ? అన్నదే కథ.

ఎలా ఉందంటే..?

ఏ సినిమాకైనా తీసుకున్న పాయింట్, దాన్ని తెరపై నడిపే విధానంమీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలోని “రివెంజ్” అనే పాయింట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తదేమీ కాదు. కానీ దాన్ని దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్ గా కాకుండా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేసాడు. ఫస్టాఫ్ ను మర్డర్ తో స్టార్ట్ చేసి మధ్య మధ్య లో మంచి కామెడీ సీన్స్ తో నడిపిస్తూనే ఫ్లాష్ బ్యాక్ లో ఏంజరిగిందో చిన్న చిన్న హింట్స్ ఇస్తూ అలా అలా నడిపించేసాడు. ఇక సినిమా సెకండాఫ్లో అసలు కథను రివీల్ చేస్తూ, హీరో ఒక్కొక్కరినీ చంపుతూ తన పగ ఎలా తీర్చుకున్నాడు, ఆ సమయంలో తనకి ఎదురైన ఆటంకాలను ఎలా దాటాడు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగింది అనే అంశాలతో కొంచెం పరవాలేదనిపించేలా నడిపించాడు దర్శకుడు సుధీర్ వర్మ.

కానీ ఈ సినిమాలో అసలు మైనస్ హత్య చేయాలనుకునేంతగా వున్న హీరో భావోద్వేగాల తీవ్రతను తెరపై చూపించకపోవడమే, దాంతోపాటు హత్యలు చేయడానికి హీరో వేసే ప్లాన్స్ ని ఇంకొంచెం పకడ్బందీగా ప్లాన్ చేస్తే బాగుండేది. దర్శకుడు సుధీర్ వర్మ ట్రైలర్లలో చెప్పినట్టు రివెంజ్ డ్రామా అనే అంశానికి ఖచ్చితంగా కట్టుబడి అనవసమైన డ్రామా ని పక్కన పెట్టడం కొంతవరకు ప్లస్ అయింది. పైగా తన కథకు అవసరంలేని కమర్షియల్ అంశాల జోలికి పోకుండా తక్కువ రన్ టైమ్ తో సినిమాను తయారుచేయడంతో ఎక్కడా మన సమయం వృధా చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ కలగలేదు. హీరో నిఖిల్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఆటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు. రీతూ వర్మ హీరో క్యారక్టర్ కి సపోర్ట్ చేస్తూ చక్కగా నటించింది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి తమ కామెడీ టైమింగ్ తో నవ్వులు పండించారు. కెమెరా వర్క్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అదనపు బలాన్నిచ్చాయి. సన్నీ ఎం.ఆర్ సంగీతం పర్వాలేదనిపించింది.

మొత్తమ్మీద “కేశవ” ట్రైలర్, టీజర్ లో వున్న ఇంటెన్సిటీ ని దృష్టిలో పెట్టుకుని చుస్తే మాత్రం కొంచెం నిరాశపడటం ఖాయం, కానీ డైరెక్టర్ కధని హేండిల్ చేసిన విధానం వల్ల  నిఖిల్ కి ఇది మరో హిట్ చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయి.

బలాలు:

  • కథా నైపథ్యం
  • నిఖిల్ పెర్ఫార్మెన్స్
  • సినిమాటోగ్రఫీ
  • కామెడీ

బలహీనతలు:

  • రొటీన్ స్టోరీ
  • తక్కువగా వున్న ఎమోషన్
  • అంచనాలను అందుకోలేకపోయిన నిఖిల్ పాత్ర చిత్రీకరణ

రేటింగ్:  3/5

Keshava Review in English

(Visited 5,121 times, 1 visits today)

Related Post