తెలుగు యువ హీరోల్లో నిఖిల్‌ది ఓ ప్రత్యేక స్థానం. కథల ఎంపికలో నిఖిల్‌ చూపించే చొరవ అభినందనీయం. రొటీన్ సినిమాలతో విసిగిపోయిన సినీ జనాలకు నిఖిల్ సినిమాలు కొత్తదనాన్ని పంచుతాయడనడంలో సందేహం లేదు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడా ఇలా ప్రతీ సినిమా కథ దేనికదే విభిన్నం. ఇప్పుడు అలాంటి ఓ సరికొత్త కథాంశంతో నిఖిల్ హీరోగా రూపొందిన సినిమా కేశవ. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ నిన్న రాత్రి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. అందరికీ ఎడమ వైపు ఉండే గుండె కుడి వైపు ఉంటే కలిగే భావోద్వేగాలు, ఆ తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాడు దర్శకుడు సుధీర్ వర్మ. పెళ్లి చూపులు ఫేం రీతూ వర్మ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్కేయండి.

(Visited 63 times, 1 visits today)

Related Post