కాటమరాయుడు తర్వాత పవన్‌కళ్యాణ్‌ చేయబోతున్న చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. పాత హీరోయిన్లందరినీ కాదని, ఫ్రెష్‌ కాంబినేషన్‌ కోసం కీర్తిని త్రివిక్రమ్‌ సెలక్ట్‌ చేశాడు. ఇంతవరకు తెలుగులో స్టార్‌ హీరోలతో నటించని కీర్తి సురేష్‌ తన శరీరాకృతి మీద అంతగా శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా ఇటీవలి చిత్రాల్లో ఆమె చాలా లావుగా కనిపించింది. లావుగా వుందంటూ, ఈమె పవన్‌ పక్కన హీరోయిన్‌ ఏంటంటూ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ కూడా బాగానే జరిగింది.

కీర్తిని సెలక్ట్‌ చేసినపుడే తన లుక్‌ ఎలా వుండాలనేది త్రివిక్రమ్‌ క్లియర్‌గా చెప్పాడట. నేను లోకల్‌ చిత్రంలో కీర్తిని చూసిన త్రివిక్రమ్‌ మరోసారి కీర్తి నీ ఇంకా సన్నబడాలని చెప్పాడట, దింతో అమ్మడు బరువు తగ్గే పనిలో పడిందట. రాపిడ్‌ వెయిట్‌ రిడక్షన్‌ ప్రాసెస్‌ ఫాలో అవుతూ చాలా వేగంగా అయిదు కిలోల బరువు తగ్గిందట. సినిమా స్టార్ట్‌ అయ్యేలోగా మరో ఎనిమిది కిలోలు తగ్గాలని గోల్‌గా పెట్టుకుందట… మరి ఈ సినిమాలో కీర్తి కొత్త లుక్ ఎలా ఉండబోతుందో తేలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

(Visited 3,624 times, 1 visits today)

Related Post